HomeAP NEWSత్రీ క్యాపిటల్స్ పై జగన్ హాట్ కామెంట్స్

త్రీ క్యాపిటల్స్ పై జగన్ హాట్ కామెంట్స్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

మూడు రాజధానులపై ఎన్ని ఆటంకాలొచ్చినా జగన్ సర్కార్‌ ముందుకే అంటోంది. క్యాపిటల్స్ విషయంలో జగన్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ముందుకెళుతున్నట్టు ఆయన యాక్షనే చెబుతోంది. తాజాగా.. వచ్చే నెలలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముందు ఏపీ ప్రభుత్వం దేశ రాజధానిలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్‌కు పలువురు దౌత్యవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నుండి వ్యక్తులను ఆహ్వానించారు. వారిని ఉద్దేశించి ఏపీ సీఎం ప్రసంగించారు. ఇలాంటి సమయంలో ప్రసంగం అంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానాలు కామన్. కానీ, సీఎం నోటివెంట మొదటి మాటగా విశాఖ వచ్చింది. అతిత్వరలో విశాఖ రాజధానిగా మారబోతోందని.. వైజాగ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖే రాజధాని అని క్లారిటీలు, విమర్శలను కాస్త పక్కన పెడితే.. జగన్ ప్రకటించినంత వేగంగా విశాఖ నుంచి పాలన మొదలవుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి లీగల్‌గా ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే. కేంద్రం కూడా అదే విషయాన్ని తెలిపింది. దీంతో ఒకవేళ వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించాలీ అంటే అసెంబ్లీలో మళ్ళీ బిల్ ప్రవేశ పెట్టాలి. దానికి గవర్నర్ ఆమోద ముద్ర పడాలి. ఈ మొత్తం వ్యవహారానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అందుకే మొదట సీఎం క్యాంపు కార్యాలయం వైజాగ్‌లో ఏర్పాటు చెయ్యాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదుర్చుకుని ఉగాది నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించి వారంలో రెండు లేదా మూడు రోజులు అక్కడి నుండే పాలన సాగిస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో ఆయన కార్యాలయం ఏర్పాటు కోసం భవనాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. రిషికొండపై రెడీ అవుతున్న భవనం సహా.. ఏయూలోని పలు భవనాలు.. కలెక్టర్ కార్యాలయం.. సర్క్యూట్ హౌస్.. టౌన్ హాల్ ఇలా అనేక భవనాలు రెడీగా ఉన్నాయి. వీటిలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు ఏది అనువుగా ఉంటుందో తేల్చే పనిలో పడ్డట్టు వైవీ కామెంట్స్ కూడా తేల్చేస్తున్నాయి. ఇదే సమయంలో విశాఖకు రాజధానిని తరలించే ప్రయత్నం వేగవంతం అవుతున్నవేళ రానున్న సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు మరోసారి అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతోంది ఏపీ ప్రభుత్వం అంటున్నారు విశ్లేషకులు. తాజాగా సీఎం చేసిన ప్రకటనతో ఆ ప్రక్రియ మరింత వేగవంతం కానున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సీఎం జగన్ తాను అతి త్వరలోనే హలో వైజాగ్ అనడం ఖాయం అని తేల్చేసారు. మరి దీనిపై విపక్షాల యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...