లేజర్ ఆయుధాలనీ.. ఆటమిక్ సబ్‌మెరైన్లనీ.. ఫైటర్ జెట్ విమానాలనీ.. నిత్యం ఏదో ఒకదాన్ని చూపిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది చైనా దేశం. ఇటీవలే తన కొత్త సబ్ మెరైన్‌ను డాక్‌లో ఉంచి ప్రపంచం ముందు షో ఆఫ్ చేసింది చైనా. తాము స్వయంగా తయారు చేసిన హ్యాంగర్ క్లాస్ సబ్ మెరైన్‌ను పాకిస్తాన్‌కు అందజేసి సముద్రంలో తమ శక్తికి తిరుగు లేదు అన్నట్టుగా ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. భారత్ శతృదేశమైన పాకిస్తాన్‌కు సాయం చేస్తూ పరోక్షంగా భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ.. ఇక్కడే చైనా నవ్వులపాలైంది. చైనాకు షాక్ ఇస్తూ.. భారత్ ఓ అద్భుతమైన స్ట్రాటజీని ప్రదర్శించింది. విదేశీ శాటిలైట్లు కూడా స్పష్టంగా ఫోటోలు తీసేలా.. భారత్ తన ఐదవ తరం ఫైటర్ జెట్ AMCA (Advanced Medium Combat Aircraft)ని బహిరంగంగా ప్రదర్శించి.. చైనాకు మాస్ రిప్లై ఇచ్చింది. శక్తివంతమైన ఆయుధాలను పాకిస్తాన్‌కు ఇస్తున్నామంటూ భారత్‌ను భయపెట్టే ప్రయత్నం చేసిన చైనాకు.. భారత్ ఇచ్చిన కౌంటర్‌తో చైనాకు ఎలా రియాక్ట్ కావాలో తెలియని పరిస్థితి.
అయితే.. చైనాకు కౌంటర్‌గా భారత్ తన ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాన్ని ప్రదర్శించినా.. ఇందులో మరో కమర్షియల్ కోణం కూడా ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఐదో తరం యుద్ధ విమానాల కోసం లక్ష కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఈ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీ టెక్నాలజీ ఉంది. ఇజ్రాయెల్, యూకే లాంటి దేశాల వద్ద పూర్తి టెక్నాలజీ లేకపోయినా.. ప్రస్తుతం ఈ ఐదో తరం జెట్ ఫైటర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి. భారత్ మాత్రం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఇజ్రాయెల్, రష్యా వంటి దేశాల సహకారంతో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌ను తయారు చేసి ప్రపంచానికి షాకిచ్చింది. ఇప్పటికే ప్రోటోటైప్ ఫైటర్ పూర్తి అయ్యి.. టెస్టింగ్ దశలో ఉంది. ఇది చూసిన ప్రపంచ దేశాలన్నీ భారత్ నుంచి ఈ ఫైటర్ జెట్లను కొనేందుకు క్యూ కట్టడం ఖాయం. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే… మన రక్షణ మరియు ఆయుధ రంగంలోకి ప్రైవేట్ సెక్టార్ బలంగా అడుగుపెట్టడమే! ప్రైవేట్ కంపెనీలు రాకతో పనులన్నీ ఇప్పుడు చాలా వేగంగా, అత్యంత నాణ్యతతో జరుగుతున్నాయి. మొన్నటి రోజే టాటా – ఎయిర్‌బస్ భాగస్వామ్యంతో తయారైన మొదటి విమానం విజయవంతంగా ఆకాశంలోకి ఎగిరింది.
