HomeAP NEWSవర్షాలపై కీలక అప్డేట్.. ఎండల కష్టాలు గట్టెక్కినట్టే

వర్షాలపై కీలక అప్డేట్.. ఎండల కష్టాలు గట్టెక్కినట్టే

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

గత కొద్ది రోజులుగా సమ్మర్ హీట్ వేవ్‌తో అట్టుడికిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మండుతున్న సూర్యుడు మరి కొద్దిరోజుల్లో చల్లబడి పోతున్నాడనీ.. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కదలిక వేగం అందుకుందనీ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కేవలం 2 లేదా 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీ తెలంగాణను తాకే అవకాశాలుయన్నాయన్నారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు కురిసే అవకాశముందని హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పులు కొనసాగనున్నాయని తెలిపింది. ప్రతి రోజు వడదెబ్బతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. ఎండలకు భయపడి పిల్లలు, వృద్ధులు ఇంట్లోంచి బయటకు రావటమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు అప్డేట్, తెలంగాణ వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి – ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు కూడా దక్షిణ బీహార్ పరిసర ప్రాంతాల నుండి జార్ఖండ్ ఒడిస్సా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు.. అంటే బుధ, గురు, శుక్ర వారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడబోతున్నాయి. చాలా వరకు ఊష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా వరకు తేలిక పాటి వర్షాలు పడటంతో పాటు పగటి ఊష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయి. ఒకసారి రుతుపవనాలు ప్రవేశిస్తే.. ఇక దాదాపుగా సమ్మర్ హీట్ ప్రభావం ముగిసినట్టే. ఓ వైపు ఎండలు.. మరో వైపు వర్షాలతో ఉక్కపోత వాతావరణం ఏర్పడవచ్చు కానీ ఎండ తీవ్రత మాత్రం హీట్ వేవ్‌లో ఉన్నంత ఉండదని అధికారులు చెప్తున్నారు.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...