HomeFILM NEWSపెద్ది క్యారెక్టర్ కోసమే జాన్వి క్యారెక్టర్ అలా రాశాను-బుచ్చిబాబు

పెద్ది క్యారెక్టర్ కోసమే జాన్వి క్యారెక్టర్ అలా రాశాను-బుచ్చిబాబు

Published on

Latest articles

భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు.. కారణాలివే

బంగారం ధరల డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు.. ఈ వారం మరింత...

రెయిన్ అలర్ట్ : తెలంగాణను ముంచెత్తనున్న భారీ వర్షాలు

రానున్న వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య...

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇండియా న్యూక్లియర్ వెపన్స్

న్యూక్లియర్ వెపన్స్.. ఇవి ఏ దేశం దగ్గర ఉంటే ఆ దేశమే ప్రపంచాన్ని శాసించగలదు.. ఎంతటి యుద్ధానికైనా తెగించగలదు.....

రామ్ చరణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వి కపూర్ పాత్రపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. జాన్వి క్యారెక్టర్‌కు ఏమాత్రం విలువ లేదనీ.. హీరోయిన్లను కేవలం గ్లామర్ మెటీరియల్‌గా వాడుకున్నారంటూ పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుపై భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. జాన్వి క్యారెక్టర్‌ను విమర్శిస్తూ టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించటం.. చివరకు బుచ్చిబాబు సారీ చెప్తూ.. జాన్వి కపూర్ నటించిన రొమాంటిక్ సీన్లను తొలగిస్తామని చెప్పటంతో వివాదం కాస్త సద్దుమణిగినట్టు కనిపించింది. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న సినిమాలో జాన్వీ కపూర్‌కు సంబంధించిన రొమాంటిక్ సీన్లు లేవు. అయితే.. ఈ వివాదంపై డైరెక్టర్ బుచ్చిబాబు మరోసారి స్పందించాడు. ఓ ఇంగ్లిష్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి క్లారిటీ ఇచ్చాడు.

“కథలో జాన్వి కపూర్ క్యారెక్టర్‌ను అందరూ అపార్థం చేసుకున్నట్టు అనిపించింది. నిజానికి.. హీరో క్యారెక్టర్‌ను ప్రేమలో పడేసే అమ్మాయి క్యారెక్టర్‌లో జాన్విని చూపించాం.. మొరటు మనిషి అయిన పెద్దిలో ప్రేమ అనే భావన రప్పించేందుకే జాన్వి కపూర్ క్యారెక్టర్‌తో రొమాంటిక్ సీన్లు రాసుకున్నాను. నా ఉద్దేశం అది మాత్రమే.. కానీ అపార్థం చేసుకున్నారు.. ఉప్పెన కంటే ఎంతో ఇష్టంతో కష్టపడి రాసుకున్న కథ ఇది.. కానీ జనం నుంచి వచ్చిన విమర్శలను ఎవరైనా పరిగణలోకి తీసుకోవాల్సిందే.. అందుకే అభ్యంతరకరమైన సీన్లను సినిమా నుంచి తొలగించాం..” అంటూ బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. జాన్వి క్యారెక్టర్‌పై విమర్శలు వ్యక్తమైనా.. రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రామ్ చరణ్ ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ క్రిటిక్స్ మెచ్చుకున్నారు. ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూలు చేసిన పెద్ది.. ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది.

FOLLOW US

More like this