మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్తంత శాంతించినప్పటికీ.. ట్రంప్ మాటను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై భారీ దాడులకు ఆదేశాలిచ్చాడు. ఫలితంగా.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలైన పెట్రో కెమికల్ ప్లాంట్‌లపై భారీ దాడులకు పాల్పడింది. అటు లెబనాన్ రాజధాని బీరూట్‌పై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఎవరూ రాజధాని టెహ్రాన్‌లో ఉండవద్దని.. వీలైనంత వెంటనే భారత్ వెళ్ళిపోవాలంటూ హెచ్చరించింది.
‘‘పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా ప్రస్తుతానికి భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణాలను మానుకోవాలని సూచిస్తున్నాం. ఇక, ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో వెంటనే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరిస్తున్నాం’’ అని ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది.
ఇరాన్‌పై అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగిన నాటి నుంచి ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటివి చాలా అడ్వైజరీలు జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్ లోని కీలక ప్రాంతాల్లో ఉంటున్న భారతీయుల ప్రాణరక్షణను దృష్టిలో పెట్టుకొని ఇరాన్ ప్రభుత్వం ఇలాంటి అడ్వైజరీలు జారీ చేసింది. యుద్ధం మొదలైన నాటి నుంచి టెహ్రాన్ నుంచి సుమారు 1600 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాగా.. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి సుమారు 6 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు భారత విదేశాంగ శాఖ చెప్పింది. ఇరాన్‌లోని కీలక ఆయుధ స్థావరాలపై దాడులు చేసి తీరని నష్టం కలిగించిన తర్వాత.. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ శాంతి అంటూ ఇజ్రాయెల్‌ను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ.. హెజ్బొల్లా తీవ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై దాడులు చేస్తోంది. అలాగే ఇరాన్ లోని కీలక ప్రాంతాలపై కూడా దాడులు జరుగుతుండటంతో ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం మరో అడ్వైజరీని జారీ చేసింది

