ఎన్ని సినిమాలు చేసినా రాని ఫేమ్.. ఒక్కోసారి ఓ చిన్న సైడ్ క్యారెక్టర్‌తో వచ్చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాని అవకాశాలు.. ఒక్కోసారి వారి కోసమే క్యారెక్టర్ పుట్టిందేమో అన్నట్టుగా వెతుక్కుంటూ వస్తాయి. చాలా మంది హీరో హీరోయిన్ల విషయంలో ఇది జరిగింది.. జరుగుతూనే ఉంది. లేటెస్ట్‌గా పెద్ది సినిమాలో నటించిన ఓ అమ్మాయి.. హీరోయిన్ జాన్వి కపూర్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెద్ది సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఆ అమ్మాయి గురించి జనాలు విపరీతంగా ఆరాలు తీస్తున్నారట.. సోషల్ మీడియాలో.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట. ఆ అమ్మాయి ఎవరో కాదు.. పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వి పక్కన ఆమె ఫ్రెండ్‌గా నటించిన సైడ్ యాక్ట్రెస్ గురించి.
పెద్ది సినిమాలో రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ స్టార్.. అందాల యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటించిన విషయం తెలిసిందే. సినిమాలో పెద్ది ఓ ఆటకూలీ కాగా.. జాన్వి కపూర్ ఆ ఆటకూలిని ప్రేమించే ఊరి అమ్మాయి. ఎప్పుడు చూసినా అచ్చియమ్మ గ్యాంగ్‌లో తిరిగే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి సినిమాలో ఉంది. చికిరి చికిరి పాటలో కూడ ఈ అమ్మాయి జాన్వి కపూర్ పక్కన కనిపిస్తుంది. పెద్ది సినిమాకు వచ్చిన జనం దృష్టి.. హీరోయిన్ పక్కనే తిరిగే ఆ క్యూట్ అమ్మాయిపై పడింది. చూడటానికి చక్కగా ఉన్న ఆ అమ్మాయి ఎవరు అంటూ జనాలు ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు.
చాలా మంది పెద్ద హీరోయిన్లు, హీరోలు అయిన వారు.. ఒకప్పుడు హీరో హీరోయిన్ల పక్కన సైడ్ క్యారెక్టర్ వేసిన వాళ్ళే. వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు కాకుండా.. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో నానా తంటాలు పడి.. చిన్నా పెద్దా క్యారెక్టర్లు చేసి.. అవకాశంతో పాటు అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఒక్కసారిగా స్టార్స్ అయిపోతారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడు స్టార్ అవుతుందో తెలియదు కానీ.. జనాన్ని మాత్రం తెగ అట్రాక్ట్ చేసింది. ఆ అమ్మాయి పేరు శ్వేతా లక్ష్మణ్. సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా కనిపించకపోయినా.. ఈమె సోషల్ మీడియాలో ఇప్పటికే ఓ చిన్నపాటి స్టార్. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. సహ అనే షార్ట్ ఫిల్మ్ ఈ అమ్మాయికి మంచి పేరు తీసుకొచ్చింది. ఎలా వచ్చిందో ఎవరిచ్చారో తెలియదు కానీ.. పెద్దిలో జాన్వి కపూర్ పక్కన సైడ్ రోల్ కొట్టేసింది శ్వేతా లక్ష్మణ్. ప్రస్తుతానికి ఈమె చాలా మందికి క్రష్ అయిపోయింది. మరి ఫ్యూచర్‌లో హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.

