HomeFILM NEWSపెద్ది రివ్యూ

పెద్ది రివ్యూ

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్.. ఉప్పెన సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమాబా తెరకెక్కిన పెద్ది.. నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కిన పెద్ది.. నేషనల్ వైడ్ పేరున్న స్టార్లతో.. ఏఆర్ రెహమాన్, రత్నవేలు వంటి పెద్ద టెక్నీషియన్లతో మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌పై పెద్ది తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. రామ్‌ చరణ్‌కు మరో బ్లాక్ బస్టర్ ఇచ్చిందా.. డైరెక్టర్ బుచ్చిబాబును పాన్ ఇండియా డైరెక్టర్‌గా నిలబెట్టిందా.. మొత్తానికి ఈ సినిమా అనుకున్నా రేంజ్‌లో ఉందా.. రివ్యూలో చూద్దాం.

కనీసం ఓటు హక్కు కూడా లేని 450 కుటుంబాలున్న ఓ ఊరు.. ఆ ఊరు కోసం ఏదో చేయాలన్న ఓ యువకుడి సంకల్పం.. అడుగడుగునా యువకుడికి ఏర్పడే అడ్డంకులు.. చివరికి ఆ యువకుడు ఆ ఊరి కోసం అనుకున్నది సాధిస్తాడా లేదా.. ఈ క్రమంలో ఏం జరిగింది.. అనేది కథా నేపథ్యం. విజయనగరం జిల్లాలో ఉండే ఆ ఊరిని కొండ కింద ఊరు అనే పిలుస్తారే తప్ప కనీసం పేరు కూడా ఉండని ఊరు అది. ఆ ఊరు గుండా రైలు వెళ్తుందే తప్ప.. అక్కడ రైలు ఆగదు. ఆ ఊరి జనం ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్ళాలి. అలాంటి ఆ ఊరిలో రైలు ఆగేలా చేసి.. ఆ ఊరికి.. ఊర్లోని జనానికి గుర్తింపు తేవటానికి యువడుకు పడే తపనే పెద్ది సినిమా.

ఆ ఊర్లో రైలు ఆగేలా చేయటం కోసం అప్పల సూరి(జగపతిబాబు) అనే ఓ పెద్ద మనిషి 30 యేళ్ళ పాటు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. గవర్నమెంట్ ఆఫీస్‌ల చుట్టూ తిరగటం.. అధికారులను బతిమిలాడుకోవటం.. ఇది ఓ వైపు జరిగే కథ

ఇదే ఊరికి చెందిన యువకుడు పెద్ది.. బెల్లం బట్టీలో పని చేస్తూ ఆటకూలీగా క్రికెట్ ఆడే పేదింటి కుర్రోడు. క్రికెట్ ఆడటంలో పెద్దికి ఉండే టాలెంట్ ఆ ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఇంకెవరికీ ఉండదు అనేది ఆ ఊరి వాళ్ళ అభిప్రాయం. క్రికెట్‌లో ఎవరూ చూడని విచిత్రమైన షాట్స్ ఆడుతూ అందరూ అసూయపడేలా చేస్తాడు. ఇదే ఊర్లో రాజకీయ నాయకుడైన సుభద్రరాజు)రావురమేష్ కూతురు అచ్చియమ్మ(జాన్వి కపూర్) అంటే పెద్దికి ఇష్టం. ఇది ఇంకో వైపు జరిగే కథ.

ఊర్లో రైలు ఆగటానికి.. కూలిపని చేస్తూ క్రికెట్ ఆడే యువకుడికి మధ్య ఏమాత్రం సంబంధం ఉండదు.. కానీ ఊరి కోసం 30 యేళ్ళ పాటు శ్రమించిన అప్పలసూరి ఓ రోజు చనిపోతాడు. అప్పలసూరి చావు.. పెద్దిలో ఊరి కోసం ఏదైనా చేయాలనే తపన కలిగిస్తుంది. అలా సరదాగా క్రికెట్ ఆడుతూ అమ్మాయితో ప్రేమలో ఉండే కుర్రోడు.. ఊరి కోసం ఏదైనా సాధించాలనే ప్రయత్నం మొదలుపెడతాడు. సినిమా మొత్తం దాదాపుగా దీనిపైనే నడుస్తుంది.

గుర్తింపు రావాలంటే ఊరికే రాదు.. ఏదైనా చేస్తేనే గుర్తింపు వస్తుంది.. గుర్తింపు లేని బ్రతుకు కంటే చావే నయం అనుకుంటాడు పెద్ది. అలా ఊరి కోసం ఓ యోధుడిగా మారతాడు. క్రికటర్‌గా ఆ తర్వాత కుస్తీ యోధుడిగా.. ఆ తర్వాత పరుగు పందెం వీరుడిగా పెద్ది మూడు ఆటల్లో ఊరి కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊరి కోసం పెద్ది ప్రయత్నించటం.. మధ్యలో హీరోయిన్‌తో రొమాన్స్‌తో కూడిన ఎమోషనల్ సీన్లు.. పెద్దిని తొక్కేయటానికి విలన్లు చేసే కుట్రలు.. ఆ కుట్రలను దాటి చివరికి తన లక్ష్యాన్ని చేరుకునే హీరో.

నిజానికి ఇది ఓ అద్భుతమైన ఇన్‌స్పిరేషనల్ కథ. ఈ కథకు లవ్, రొమాన్స్, ఎమోషన్లు జోడించి సినిమాటిక్‌గా కథను తీర్చిదిద్దారు. కథలో ఉండే క్యారెక్టర్లు కూడా కథకు తగినట్టే ఉంటాయి. అయితే.. ఏ క్యారెక్టర్ కూడా సినిమాను మలుపు తిప్పే క్యారెక్టర్ కాకపోవటం సినిమాకు మైనస్. రాజకీయ నాయకుడి క్యారెక్టర్లో రావు రమేష్, పెద్దిని మల్ల యోధుడిగా తీర్చిదిద్దే క్యారెక్టర్లో శివరాజ్ కుమార్, ఊరి కోసం ప్రాణత్యాగం చేసే క్యారెక్టర్లో జగపతి బాబు, చివరికి హీరోయిన్ జాన్వి కపూర్, దివ్యేందు శర్మ సహా అన్ని క్యారెక్టర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది తప్ప.. ఏ క్యారెక్టర్‌కు కూడా హైప్ ఇవ్వలేదు డైరెక్టర్. శృతి హాసన్ ఐటమ్ సాంగ్ కాసేపు ఎంటర్టైన్ చేసినా.. రెహమాన్ సంగీతం మరీ పెద్దగా అలరించినట్టు లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అని చెప్పలేం. చికిరి పాట తప్ప మిగతా ఏ పాట కూడా సంగీత ప్రియులను అలరించలేదు. కాకపోతే.. రామ్ చరణ్ కోసం చేసిన కొరియోగ్రఫీ సూపర్ అని చెప్పాలి.

అక్కడక్కడా ఎమోషనల్ సీన్లు.. మనసుకు హత్తుకునే డైలాగ్స్.. సినిమాలోని బేసిక్ కథాంశం.. ఇవి సినిమాలో గుర్తుండిపోయేవి కాగా.. అన్నింటినీ మించి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అతడి కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. మూడు ఆటలు ఆడే క్యారెక్టర్ కోసం తనను తాను రామ్ చరణ్ మలచుకున్న విధానం అద్భుతం. సినిమా మొత్తాన్ని చెర్రీ తన భుజస్కందాలపైనే నడిపించాడని చెప్పాలి. ఇక.. మూడు ఆటలను ఒకే సినిమాలో చూపించటం.. ఒకే క్యారెక్టర్‌తో మూడు ఆటలు ఆడించి ఔరా అనిపించటంలో డైరెక్టర్ బుచ్చిబాబు సూపర్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ.. ఎడిటింగ్.. స్క్రీన్ ప్లే.. ఇవన్నీ ఉండాల్సిన స్థాయిలోనే ఉన్నాయి తప్ప.. ఓ రేంజ్‌లో ఉన్నాయిరా బాబు అనిపించే స్థాయిలో మాత్రం లేవు. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు మాస్ డైలాగ్స్.. ఫైట్ సీన్లు పిచ్చెక్కిస్తాయి. మొత్తానికి.. పెద్ది సినిమా రామ్ చరణ్ కష్టానికి దక్కిన ఫలితం.. కానీ.. చెర్రీ తప్ప మిగతవాన్నింటినీ డైరెక్టర్ వందకు వంద శాతం హ్యాండిల్ చేయలేకపోయాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. ఎవరి నుంచైనా సరే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టుకునే బాధ్యత డైరెక్టర్‌దే కాబట్టి. సో.. ఓవరాల్‌గా సినిమా కథ సూపర్.. కొంత మంది పర్ఫార్మెన్స్.. టేకింగ్ తప్ప.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...