HomeTELANGANAతెలంగాణకు రెయిన్ అలర్ట్ : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్ : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

Published on

Latest articles

It Wasn’t Trump Who Won, But Iran? Critics Say the Peace Deal Is Nothing More Than a Political Drama

The crisis that gripped West Asia for nearly 107 days is now approaching a...

100 Foreign Visits in 12 Years: PM Modi Creates a New Record

Prime Minister Narendra Modi has added another significant milestone to his political career. Having...

Punishment for Vaibhav Suryavanshi? Here’s the Truth Behind the Controversy

Until recently, the cricketing world was praising young sensation Vaibhav Suryavanshi for displaying maturity...

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. వచ్చే 2,3 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండతో సహా మొత్తం 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది.

మంగళవారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇక ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడుతుంటే మరోవైపు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ద్రోణి ప్రభావంతో బుధవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

FOLLOW US

More like this