HomeTELANGANA"ఔను.. నా అయ్య జాగీరే" : పవన్‌కు పొన్నం ప్రభాకర్ కౌంటర్

“ఔను.. నా అయ్య జాగీరే” : పవన్‌కు పొన్నం ప్రభాకర్ కౌంటర్

Published on

Latest articles

10 రూపాయలు పెరగనున్న పెట్రోల్ : క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన చమురు కష్టాలు.. మున్ముందు ఇంకా పెరగనున్నాయే తప్ప తగ్గేలా కనిపించటం...

“ఔను.. నా అయ్య జాగీరే” : పవన్‌కు పొన్నం ప్రభాకర్ కౌంటర్

తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెట్టొద్దంటూ కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టిన వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతోంది....

పవన్ కళ్యాణ్‌కు మోడీ బంపర్ ఆఫర్.. కేంద్రమంత్రిగా జనసేన ఎంపీ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పూర్తి అయిన సందర్భంగా కేంద్రమంత్రి వర్గంలో కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని...

తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెట్టొద్దంటూ కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టిన వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతోంది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్‌గా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చిపోయి మాట్లాడాడు. “నన్ను తెలంగాణలో అడుగుపెట్టొద్దని చెప్పటానికి మీరెవరు.. తెలంగాణ మీ అయ్య జాగీరా?” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది. పవన్‌కు కౌంటర్‌గా ప్రెస్ మీట్ పెట్టిన కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్.. పవన్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. “ఔను.. తెలంగాణ నా అయ్య జాగీరే.. మిస్టర్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ 4 కోట్ల ప్రజలు నా వాళ్ళే.. తెలంగాణ నా అయ్య జాగీరే.. ఏపీలో ఏం పీకావ్.. తెలంగాణలోకి వచ్చి ఏం పీకుతావు..” అంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు పొన్నం.
తెలంగాణ ఆవిర్భావ సభ రోజున అనవసరంగా కాంగ్రెస్ నేతలను గెలకవద్దనీ.. తెలంగాణ పౌరుల ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టొద్దనీ వార్నింగ్ ఇచ్చాడు పొన్నం ప్రభాకర్.

తెలంగాణలో అంత మం”ది విద్యార్థులు అమరులైతే.. అమరుల కుటుంబాలకు న్యాయం జరగనప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించాడు పొన్నం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పవన్ కళ్యాణ్‌ను ఎంగేజ్ చేస్కున్నారంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తిరగాలనుకుంటే తిరుగు.. నువ్వు నటుడివి.. మేం తిరగొద్దని చెప్పలేదు.. కానీ తెలంగాణ ఆవిర్భావ సభ రోజున హైదరాబాద్ వచ్చి ఎందుకు ఇలాంటి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.. ఏపీ తెెలంగాణ మధ్య విభజన సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించని మీరు.. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపణలు ఎవరిపై చేస్తున్నారు.. గద్దర్ పేరు చెప్పకండి.. ఆయన ఆత్మ క్షోభిస్తుంది..” అంటూ పవన్ వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. చిన్నగా మొదలైన వివాదం పవన్ ప్రెస్ మీట్‌తో పెద్దది కాగా.. పవన్‌కు పొన్నం కౌంటర్‌తో ఇది మరింత పెద్దగా మారే అవకాశం కనిపిస్తోంది.

FOLLOW US

More like this

10 రూపాయలు పెరగనున్న పెట్రోల్ : క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన చమురు కష్టాలు.. మున్ముందు ఇంకా పెరగనున్నాయే తప్ప తగ్గేలా కనిపించటం...

పవన్ కళ్యాణ్‌కు మోడీ బంపర్ ఆఫర్.. కేంద్రమంత్రిగా జనసేన ఎంపీ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పూర్తి అయిన సందర్భంగా కేంద్రమంత్రి వర్గంలో కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని...

కేసీఆర్‌ను ఒక్క మాట అన్నానా.. అదీ నా పద్ధతి : పవన్

తెలంగాణలో జనసేన పోటీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్...