HomeNATIONAL NEWSబీజేపీకి అన్నామలై షాక్.. పార్టీని వదిలిపెట్టిన కాషాయ ఆశాకిరణం

బీజేపీకి అన్నామలై షాక్.. పార్టీని వదిలిపెట్టిన కాషాయ ఆశాకిరణం

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

తమిళనాడులో ఏనాటికైనా కాషాయ జెండా ఎగురవేస్తాడనీ.. ద్రవిడ రాజ్యంలో సమూల మార్పులు తీసుకొస్తాడని నమ్మిన భారతీయ జనతా పార్టీ ఆశాకిరణం.. కుప్పుసామి అన్నామలై.. బీజేపీకి ఊహించని షాకిచ్చాడు. తన సిద్ధాంతాలతో ఏకీభవించని పార్టీతో కొనసాగలేని అన్నామలై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇదివరకే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర నాయకత్వం తన సిద్ధాంతంతో ఏకీభవించనందుకే రాష్ట్ర నాయకత్వాన్ని వదులుకున్నాడని అంతా అనుకున్నారు.. కానీ అక్కడే అన్నామలై ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ‘మక్కల్ శక్తి ఇయక్కం’ పేరుతో తమిళనాట ఓ ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కార్యాచరణ చేపట్టిన అన్నామలై.. త్వరలోనే తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నాడని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది.

తమిళనాడు బీజేపీని నాకు వదిలేయండి.. అధికారంలోకి ఎలా తేవాలో నేను చూసుకుంటాను.. అంటూ బీజేపీ జాతీయ అధిష్టానం నమ్మకాన్ని సంపాదించి.. అతి చిన్న వయసులో అతి తక్కువ రాజకీయ అనుభవంతో ఏకంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ పగ్గాలను చేపట్టిన అన్నామలై.. కాలికి బట్టకట్టకుండా రాష్ట్రమంతా తిరిగి తనదైన శైలిలో బీజేపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచాడు. ఇందులో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ.. ఏ పార్టీలోనైనా ఎల్లకాలం ఏకాభిప్రాయం ఉండదు అనేది కాదనలేని సత్యం. పది మందికి ఒకేరకమైన అభిప్రాయం ఉండటం అసాధ్యం. ఇలాంటి భిన్నాభిప్రాయాలున్న పది మంది ఒకే చోట ఉంటే చీలికలు ఏర్పడక తప్పదు. ఇక్కడ కూడా అదే జరిగింది.

ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రతిపాదించిన ‘మూడు భాషల విధానం’ అమలు విషయంలో అన్నామలైకి, కేంద్ర నాయకత్వానికి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తమిళనాడులో ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అనవసరమైన మానసిక ఒత్తిడి పెరుగుతుందని అన్నామలై భావించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆయన కేంద్రానికి గట్టిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దీనిపై ఎక్స్ వేదికగా బహిరంగంగానే పోస్ట్ చేస్తూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కానీ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో నొచ్చుకున్న అన్నామలై.. తన అభిప్రాయానికి విలువలేని చోట తాను ఉండటం మంచిది కాదని భావించి ఉండొచ్చు. అందుకే.. ప్రస్తుతానికి కొత్త ఉద్యమ సంస్థ అంటూ మక్కల్ శక్తి ఇయక్కంను మొదలుపెట్టినా.. భవిష్యత్తులో అది ప్రత్యేక రాజకీయ పార్టీగా మారే అవకాశం లేకపోలేదు.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. తమిళనాడులో తమ ఆశాకిరణం అన్నామలై మాత్రమేనని భావించిన బీజేపీ కేంద్ర అధిష్టానం.. అన్నామలై కొత్త ఉద్యమ సంస్థ ప్రకటించనున్నాడంటూ వార్తలు వచ్చినా ఏమాత్రం స్పందించకపోవటం. ఇదే ఇప్పుడు తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది. అత్యంత తెలివైన మరియు డేరింగ్ డాషింగ్ ఏపీఎస్ అధికారిగా పేరున్న వ్యక్తి.. తమిళనాడులో బీజేపీని ఎలా విస్తరించాలో పాదయాత్రలు చేసి మరీ వ్యూహరచన చేసిన వ్యక్తి.. ద్రవిడ రాజ్యంలో బీజేపీకి ఓటు బ్యాంకును సంపాదించి పెట్టిన వ్యక్తిని దూరం చేసుకునేందుకు బీజేపీ ఎందుకు సిద్ధపడిందో ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది.

ఇటీవలే తమిళనాట ద్రవిడ పార్టీల నుంచి అధికారం సరికొత్త చేతుల్లోకి మారింది. దశాబ్ధాల తమిళ ప్రజల ద్రవిడ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రం మరో వైపుకు కదులుతున్నది అన్నట్టుగా కనిపిస్తోంది. కొత్తగా ముఖ్యమంత్రి అయిన దళపతి విజయ్.. తమిళ రాజకీయాల్లో ఏవో సంస్కరణలు తీసుకొస్తాడనే ఆశాభావం ప్రబలుతోంది. ద్రవిడ సిద్ధాంతాలను వద్దన్న తమిళ ప్రజలు ఏనాటికైనా కాషాయ పార్టీవైపు వచ్చేస్తారన్న ఆశాకిరణం ఉదయించే సమయంలో.. అన్నామలై నిర్ణయం.. ఖచ్చితంగా బీజేపీకి భారీ ఎదురుదెబ్బే. అన్నామలై కొత్త పార్టీ స్థాపించకుండా ఆపి.. తమతో పాటే ఉంచుకోకపోతే.. బీజేపీకి భారీ నష్టం తప్పదు.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...