HomeSPORTSక్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ ధమాకా.. వరుసగా ఆరు నెలలు పండగే

క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ ధమాకా.. వరుసగా ఆరు నెలలు పండగే

Published on

Latest articles

500 నోటు స్థానంలో 700 నోటు.. ఆర్బీఐ కొత్త నిర్ణయం ?

కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయా.. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేసి వాటి...

మా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల.. పవన్...

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాంధవి హాట్ పిక్స్

బాంధవి శ్రీధర్.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా క్యూట్ ఆండ్ టెర్రిఫిక్ లుక్స్‌తో ఒకే క్యారెక్టర్లో రెండు...

రెండు నెలల పాటు ఐపీఎల్‌తో ఫుల్ ఎంజాయ్ చేసిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు అటు ఐపీఎల్ హంగామా ముగిసిందో లేదో.. టీమ్ ఇండియా వరుస షెడ్యూల్‌తో మళ్ళీ పండగ చేసుకోనున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత కనీసం వారం రోజులు కూడా గ్యాప్ లేకుండానే టీమిండియా సిరీస్‌ల పరంపర మొదలుకానుంది.
జూన్ 6 నుంచి ఇండియన్ టీమ్ మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. దీనికి న్యూ చండీగఢ్ వేదిక కానుంది. జూన్ 6 నుంచి జూన్ 10 వరకు భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఒకే ఒక్క చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే జూన్ 13 నుంచి జూన్ 20 వరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగబోతోంది. అఫ్గానిస్తాన్ సిరీస్ పూర్తి కాగానే టీమ్ ఇండియా విదేశీ పర్యటనలకు బయలుదేరుతుంది. జూన్ 26 నుంచి జూన్ 29 వరకు ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత్ 2 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ వెంటనే జూలై నెలలో ఇంగ్లాండ్‌తో భారీ సిరీస్ షెడ్యూల్ అయింది. జూలై 1 నుంచి జూలై 11 వరకు ఇంగ్లాండ్ గడ్డపై 5 మ్యాచ్‌ల భారీ టీ20 సిరీస్, ఆ తర్వాత జూలై 14 నుంచి జూలై 19 వరకు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనున్నాయి.

ఇంగ్లాండ్ షెడ్యూల్ పూర్తి కాగానే టీమిండియా వరుసగా జింబాబ్వే, శ్రీలంక దేశాల్లో పర్యటించనుంది. ఈ పర్యటనల్లో భాగంగా జూలై 23 నుంచి జూలై 26 వరకు జింబాబ్వే దేశంలో భారత్ 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక ఆగస్టు నెలలో టీమిండియా పొరుగు దేశమైన శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. లంకతో భారత్ 2 టెస్ట్ మ్యాచ్‌లు, అలాగే 3 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే శ్రీలంక షెడ్యూల్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.

టీమిండియా ఇంటర్నేషనల్ క్రికెట్ ఫుల్ షెడ్యూల్ 2026

జూన్ 6న భారత్ వర్సెస్ ఆప్ఘనిస్తాన్ సింగిల్ టెస్ట్ మ్యాచ్‌తో బిజీ షెడ్యూల్ మొదలుకానుంది. జూన్ 6 నుంచి 10 వరకు టెస్ట్ మ్యాచ్.. ఆ తర్వాత జూన్ 13 నుంచి జూన్ 20 వరకు ఇదే ఆప్ఘనిస్తాన్‌తో 3 వన్డే మ్యాచ్‌లు ముగించుకున్న తర్వాత జూన్ 26 నుంచి 29 వరకు ఐర్లాండ్‌లో పర్యటించి 2 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

జూలై 1 నుంచి 19 వరకు భారతజట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 23 నుంచి 26 వరకు జింబాబ్వేలో పర్యటించి 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఆగష్టులో శ్రీలంక టూర్ ఉండగా.. ఈ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.
ఆ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్‌లోనూ.. ఆ తర్వాత వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత కూడా టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఉన్నా.. తేదీలు ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు కొన్ని నెలల పాటు క్రికెట్‌ను ఎంజాయ్ చేసే అవకాశం రానుంది.

FOLLOW US

More like this

500 నోటు స్థానంలో 700 నోటు.. ఆర్బీఐ కొత్త నిర్ణయం ?

కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయా.. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేసి వాటి...

మా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల.. పవన్...

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాంధవి హాట్ పిక్స్

బాంధవి శ్రీధర్.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా క్యూట్ ఆండ్ టెర్రిఫిక్ లుక్స్‌తో ఒకే క్యారెక్టర్లో రెండు...