తెలంగాణ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ల విషయంలో మరోసారి చుక్కెదురైంది. జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు రేవంత్ సర్కార్ బ్రేకులు వేసింది. వచ్చే ఆరు నెలల వరకు తెలంగాణ ఉద్యోగుల విషయంలో ఎలాంటి ట్రాన్స్‌ఫర్లు ఉండకుండా ఆంక్షలు విధిస్తూ ఈ మేరకు జీఓ 57 విడుదల చేసింది.
దీనికి ముందు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మే 1 నుంచి 31 మధ్య బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అనూహ్యంగా జూన్ 1 నుంచి సాధారణ బదిలీలపై తిరిగి ఆంక్షలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో వచ్చే ఆరు నెలల పాటు సాధారణ ఉద్యోగుల బదిలీలు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రత్యేక పరిపాలనా అవసరాలు లేదా ప్రభుత్వ అనుమతితో జరిగే బదిలీలకు మాత్రం మినహాయింపులు ఉండే అవకాశం ఉంది. మే నెలలో బదిలీ పొందని ఉద్యోగులు తదుపరి సడలింపు కోసం వేచి చూడాల్సిందే. కేవలం 3 కేటగిరీల ఉద్యోగులకు మాత్రమే ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపింది. ఇందులో పదోన్నతి పోస్టింగ్‌లు ఇతర ఉద్యోగులను తొలగించకుండా, కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రమే అని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం జూన్ 1, 2026 నుండి ఆరు నెలల పాటు ఉద్యోగుల బదిలీలపై పూర్తి నిషేధం విధించింది. అయితే పదోన్నతులు మరియు కొన్ని అత్యవసర కేటగిరీలకు మాత్రం ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చింది. అలాగే ప్రత్యేక సందర్భాలుగా పోస్టుల రద్దు, రివర్షన్‌లు, స్వదేశానికి పంపడం, విదేశీ సేవా డిప్యుటేషన్‌లు, క్రమశిక్షణా చర్యలు, కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రమేనని తెలిపింది. అలాగే మూడో కేటగిరీ దీర్ఘకాలిక సెలవుపై తిరిగి రావడం. ఆరు నెలలకు మించిన సెలవుపై తిరిగి వచ్చే ఉద్యోగులను కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలలో మాత్రమే నియమించవచ్చని ప్రభుత్వం తెలిపింది. నియామక అధికారులు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా పై మినహాయింపులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయవచ్చని వెల్లడించింది. భవిష్యత్తులో ఏవైనా సడలింపులకు ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు అవసరమని చెప్పింది.

