తెలుగులో ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే ఏకైక సినిమా పెద్ది మాత్రమే. రామ్ చరణ్ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఏవీ లేవు. సింగిల్‌గానే పెద్ది సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు వస్తుండగా.. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో భారీగానే సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో మై 2 సెంట్స్, పాటు డెడ్ మ్యాన్స్ వైర్, బ్రెజిల్ 70 : ది థర్డ్ స్టార్ ఇంగ్లిష్ సినిమాలు రిలీజ్ అవుతుండగా.. రఫా సీజన్ 1 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. జియో హాట్ స్టార్‌లో కజిన్స్ ఆండ్ కళ్యాణమ్స్ అనే మళయాలమ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది.. అయితే.. తెలుగు డబ్బింగ్ వర్షన్లో కూడా ఇది అందుబాటులో ఉంది. అమెజాన్ప్రైమ్లో ఈ వారం ఏకంగా 6 సినిమాలు రిలీజ్ కానున్నాయి. తెలుగు తమిళ్ వర్షన్లో లీడర్ సినిమా, తెలుగులో భీమ్సేరి, పైసావాలా, నవాబ్స్ కేఫ్ సినిమాలు రిలీజ్ కానుండగా.. సీట్ ఎడ్జ్ అనే కన్నడ సినిమా, మర్మెయిడ్ అనే ఇంగ్లిష్ మూవీ స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. జీ5లో డ్రింకర్ సాయి, ఈటీవీ విన్లో మేరీ ఆవాజ్ సునో అనే రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఈ సినిమాలు సిరీస్‌ల సంగతి పక్కనపెడితే.. ఈ వారం భారీ అంచనాల మధ్య కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముఖ్యంగా.. బాలీవుడ్‌కు కాసుల వర్షం కురిపించిన ధురంధర్ రివేంజ్ సినిమా.. జూన్ 5 నుంచి జియో హాట్ స్టార్‌లో రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ధురంధర్ పార్ట్ 2.. భారత్‌లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన మల్టీ స్టారర్ పేట్రియాట్ సినిమా.. జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ది మార్క్డ్ ఉమెన్, ది బ్లడ్ సిస్టర్స్ సినిమాలపై కూడా భారీ అంచనాలున్నాయి.

