HomeFILM NEWSపెద్ది సినిమాకు తప్పని నైజాం కష్టాలు.. రిలీజ్ అవుతుందా ?

పెద్ది సినిమాకు తప్పని నైజాం కష్టాలు.. రిలీజ్ అవుతుందా ?

Published on

Latest articles

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3800 ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పెద్ద తీపి కబురు చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా...

తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ షాక్.. బదిలీలకు బ్రేక్

తెలంగాణ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ల విషయంలో మరోసారి చుక్కెదురైంది. జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు...

ఇరాన్‌ఫై దాడులు ఆపని ట్రంప్.. ఈ సారి భారీ విధ్వంసం

ఓ వైపు శాంతి ఒప్పందం అంటూనే మరో వైపు ఇరాన్‌పై దాడులు ఆపటం లేదు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా పెద్ది.. అటు జూన్ 4న రిలీజ్‌కు సిద్ధమైనా.. నైజాంలో మాత్రం ఈ సినిమా సంగతి ఇంకా ఎటూ తేలటం లేదు. భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు.. దేశవ్యాప్తంగా ప్రమోషన్ ఈవెంట్లు.. ఇవన్నీ బాగానే జరుగుతున్నా.. నైజాం ఏరియాలో పెద్ది సినిమా పరిస్థితిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏపీలో ఇప్పటికే పెద్ది సినిమా కోసం టికెట్ ధరలు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసినా.. నైజాం ఏరియాలో ఇంకా ఏ స్పందనా లేదు. పెద్ది సినిమా టికెట్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ రకమైన ప్రకటన ఇంకా వెలువడలేదు. జూన్ 4న పొద్దున్నే 8 గంటలకు సినిమా మొదటి ఆట ఉండగా.. ఇప్పటికీ ఇంకా ధరల విషయంలో క్లారిటీ రాకపోవటం గమనార్హం.

నైజాం ఏరియాలో ప్రీమియర్ షో లు ఉంటాయా లేదా.. టికెట్ ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ వస్తుందా రాదా.. దీనిపై సినిమా టీమ్ కూడా ఏరకమైన ప్రకటన చేయలేదు. కాకపోతే.. సినిమా షోల షెడ్యూల్ మాత్రం ఫిక్స్. కేవలం టికెట్ ధరలు, ప్రీమియం షోల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో సినిమాను చూడటం మాత్రం ఖాయం. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వకపోయినా.. పాత ధరలకే సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు ఎలాగూ ఉంది. కానీ.. సినిమా మేకర్స్ మాత్రం తెలంగాణ టికెట్ల విషయంలో కాస్త నష్టపోవాల్సి వస్తుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా విషయంలో జరిగిన అసాధారణ సంఘటనల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపు విషయంలో కాస్త అటూ ఇటూగా వ్యవహరిస్తోంది. పెద్ది సినిమా విషయంలో కూడా ఇలాగే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందా.. లేక చివరి నిముషంలో టికెట్ ధరల పెంపునకు అంగీకరిస్తుందా చూడాలి

FOLLOW US

More like this