HomeNATIONAL NEWSగ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ విషయంలో సంక్షోభం ఏర్పడిన తర్వాత.. ప్రపంచం మొత్తం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకటం ప్రారంభించింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌ను ఎంత వీలైతే అంత ఆదా చేయటంతో పాటు.. వీలైనంత తక్కువ వాడేందుకు కొత్త మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. భారతదేశం కూడా ఇదే మార్గంలో కొన్ని ప్రత్యామ్నాయాలను ఆలోచించింది. వాటిలోంచి పుట్టుకొచ్చిందే పైప్డ్ నేచురల్ గ్యాస్ ఆలోచన. పెట్రోలియం గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ సవరణ ఉత్తర్వులు 2026 నోటిఫై చేస్తూ ప్రకటన జారీ చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ పొందే డొమెస్టిక్ వినియోగదారులకు అదనపు ఉపశమనం, సౌకర్యం కల్పించేందుకు నిబంధనలను సవరించారు. పీఎన్‌జీ కనెక్షన్లు పొందే వినియోగదారులకు సౌకర్యం కల్పిస్తూ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు. పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ఎల్పీజీ వినియోగదారులకు పలు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యా్స్ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్ రద్దు చేయమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక భవిష్యత్తులో నాన్ పీఎన్‌జీ ప్రాంతంలోకి మారినప్పుడు ఎల్పీజీ కనెక్షన్ పునరుద్దరించుకునేందుకు ట్రాన్స్‌ఫర్ వోచర్ ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ అందుబాటులో లేని వారికి వెంటనే ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చే విధంగా కొత్త వెసులుబాటు తీసుకొచ్చింది. అంటే.. పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడుతున్న ఎవరైనా సరే.. ఉద్యోగరీత్యా లేదంటే మరే కారణం వల్లనైనా ఉన్న ప్రాంతం విడిచి వెళ్తే.. కొత్తగా నివాసం ఉండే చోట అడిగిన వెంటనే ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చేలా కేంద్రం వెసులుబాటు తెచ్చింది. తరచుగా ట్రాన్స్‌ఫర్‌లు జరిగే ప్రభుత్వ ఉద్యోగులకు, అద్దె ఇళ్ళలో ఉండే వారికి, చదువు కోసం వలస వెళ్ళే విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ వెసులుబాటు తీసుకొచ్చింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి.. పీఎన్జీ నుంచి ఎల్పీజీకి మారటంలో ఎలాంటి ఆలస్యం మరియు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పీఎన్‌జీలోకి మారేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహాకాలు కూడా ప్రకటిస్తున్నాయి. పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకుంటే సబ్సిడీలు కూడా ప్రకటిస్తు్న్నాయి. ఇక చమురు కంపెనీలు కూడా పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్లను సరెండర్ చేయాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. అయితే.. ఎల్పీజీ లేదా పీఎన్జీలలో ఏదో ఒక కనెక్షన్ మాత్రమే ఉండాలి.. రెండూ ఉంటే ఏదో ఒకటి రద్దు చేసుకోవాల్సిందే.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...