HomeINTERNATIONAL NEWSచైనాకు గట్టి షాక్.. అమెరికా భారత్‌ మధ్య మరో భారీ డీల్

చైనాకు గట్టి షాక్.. అమెరికా భారత్‌ మధ్య మరో భారీ డీల్

Published on

Latest articles

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ విషయంలో సంక్షోభం ఏర్పడిన తర్వాత.. ప్రపంచం మొత్తం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకటం ప్రారంభించింది. లిక్విడ్...

ఆధార్ యాప్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పాతది పనిచేయదు

ఆధార్ కార్డ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌పై యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే యాప్ విషయంలో...

మాటతప్పిన ట్రంప్.. ఇరాన్‌పై భారీ మెరుపు దాడి

అందరూ ఊహించినట్టే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చాడు. ఇరాన్ పై యుద్ధాన్ని ఆపేస్తున్నామనీ.. శాంతి ఒప్పందం...

రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ప్రపంచంపై ఆధిపత్యం సాగిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా భారత్ మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. క్రిటికల్‌ మినరల్స్‌ సరఫరాకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దిల్లీ వేదికగా జరుగుతున్న క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుబంధంగా ఈ ఒప్పందం కుదిరింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అమెరికా మధ్య ఈ డీల్ చాలా ముఖ్యమైనదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. అధునాతన తయారీ, ఇంధన వ్యవస్థలు, సాంకేతికత అభివృద్ధి తదితర రంగాల్లో అరుదైన ఖనిజాలు, క్రిటికల్‌ మినరల్స్‌ వినియోగం అత్యంత కీలకం. జైశంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ క్వాడ్‌ సదస్సులో అమెరికా మంత్రి మార్కో రూబియోతో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌ విదేశాంగ మంత్రులు పెన్నీ వాంగ్‌, తోషిమిత్సు పాల్గొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్‌ మీదుగా సరకు రవాణా, ఇండో-పసిఫిక్‌ తదితర అంశాలపై వీరంతా చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించవద్దని, ఉగ్రదాడులకు వ్యతిరేకంగా పోరాడే హక్కు అన్ని దేశాలకు ఉందని ఈ కూటమి సభ్యులు తీర్మానించారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత్ చైనా సహా పెద్ద ఆర్థిక దేశాలన్నింటిపైనా విపరీతమైన సుంకాలను విధిస్తూ వచ్చాడు. భారత్‌పై 75 శాతం వరకు సుంకం విధించగా.. చైనాపై ఏకంగా 200 శాతం వరకు టారిఫ్‌లను విధించాడు. చైనా వస్తువులను అమెరికాలో అమ్ముకోవాలంటే 200 శాతం టారిఫ్ చెల్లించక తప్పలేదు. భారత్ విషయంలో అమెరికా టారిఫ్ యుద్ధం ప్రకటించిన భారత్ ఏమాత్రం స్పందించలేదు. స్పష్టమైన విదేశాంగ విధానంతో ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ.. చైనా మాత్రం అమెరికాకు ఊహించని షాకిచ్చింది. అమెరికా అభివృద్ధి మరియు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వస్తువుల తయారీకి బ్రేక్ వేసింది. అంటే.. మిసైల్స్ తయారీలోనూ.. మైక్రో చిప్స్ మరియు సెమీ కండక్టర్ తయారీలోనూ వాడే కొన్ని అత్యంత అరుదైన మినరల్స్‌ను అమెరికాకు ఎగుమతి చేయకుండా ఆపేసింది. దీంతో అమెరికాలోని దిగ్గజ కంపెనీలకు అతిపెద్ద షాక్ తగిలింది. చైనా నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ దిగుమతి కాకపోతే.. వాటిని తైవాన్ నుంచి కొనుగోలు చేయాలని ట్రంప్ ప్రయత్నించాడు.. కానీ చైనా దాన్ని కూడా అడ్డుకుంది. దీంతో.. ఏం చేయాలో అర్థం కాని ట్రంప్.. చివరకు భారత్‌, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో క్వాట్ కూటమి ఏర్పాటు ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. భారత్ అమెరికా మధ్య కుదిరిన ఈ డీల్ తర్వాత జపాన్ ఆస్ట్రేలియాలోని రేర్ ఎర్త్ మినరల్స్‌ను భారత ఇంజనీర్లు వెలికి తీస్తారు.. ఇందుకు కావాల్సిన పెట్టుబడిని అమెరికా పెడుతుంది. ఈ విధంగా చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయమే క్వాడ్ కూటమి మధ్య జరిగిన ఒప్పందం

FOLLOW US

More like this

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ విషయంలో సంక్షోభం ఏర్పడిన తర్వాత.. ప్రపంచం మొత్తం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకటం ప్రారంభించింది. లిక్విడ్...

ఆధార్ యాప్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పాతది పనిచేయదు

ఆధార్ కార్డ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌పై యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే యాప్ విషయంలో...

మాటతప్పిన ట్రంప్.. ఇరాన్‌పై భారీ మెరుపు దాడి

అందరూ ఊహించినట్టే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చాడు. ఇరాన్ పై యుద్ధాన్ని ఆపేస్తున్నామనీ.. శాంతి ఒప్పందం...