సినిమా స్టార్లు ధరించే బ్రాండెడ్ బట్టలు.. ఖరీదైన బూట్లు.. కోట్లు విలువ చేసే గ్యాడ్జెట్ల గురించి మనం తరచుగా సోషల్ మీడియాలో వార్తలు చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ సెలబ్రిటీలు ధరించే గాడ్జెట్స్‌పై అప్పుడప్పుడు ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలే చక్కర్లు కొడుతుంటాయి. లేటెస్ట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ధరించిన రిస్ట్ వాచ్‌పై ఇలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆర్‌సీబీ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను బన్నీ కలిసినప్పుడు దిగిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే అందరి దృష్టి ఆయన వేసుకున్న లగ్జరీ వాచ్‌పై పడింది. ఆ వాచ్ ధర తెలుసుకున్న జనాలు.. రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఫోటోలో కనిపిస్తున్న వాచ్..
పాటెక్ ఫిలిప్ అనే కంపెనీకి చెందిన నాటిలస్ మూన్ ఫేస్ రోజ్ గోల్డ్ అనే మోడల్ అనీ.. దీన్ని 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారు చేస్తారనీ.. దీని విలువ సుమారు రెండున్నర కోట్లకు పైమాటేననీ జనాలు చెప్పుకుంటున్నారు. బన్నీ ధరించిన వాచ్ గురించి ఇంటర్నెట్లో వెతికి మరీ దాని వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. బన్నీ వాచ్ గురించి రకరకాల గుసగుసలు చెప్పుకుంటున్నారు.
ఈ వాచ్ అమ్మేస్తే హైదరాబాద్‌లో ఓ లగ్జరీ విల్లా కొనుక్కోవచ్చు అని కొంత మంది కామెంట్ చేస్తే.. ఈ వాచ్ ఖరీదుతో ఒక సామాన్య కుటుంబం జీవితాంతం సుఖంగా బతికేయొచ్చు అని మరి కొంత మంది రియాక్ట్ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే.. అదీ మా హీరో రేంజ్ అన్నట్టుగా తెగ సంబరపడిపోతున్నారు. నిజానికి స్టార్ హీరోలు ఇలాంటి ఖరీదైన గ్యాడ్జెట్స్ ధరించటం కొత్తేమీ కాదు. వరల్డ్స్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ గా పేరున్న బ్రాండ్లను టాలీవుడ్ హీరోలు వాడటం పరిపాటే. ముఖ్యంగా అల్లు అర్జున్.. ఇలాంటి చాలా రకాలైన వాటిని కలెక్షన్‌గా మెయింటెన్ చేస్తుంటాడు. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ దుస్తులను.. లిమిటెడ్ ఎడిషన్ కార్లను.. ఆర్డర్ ఇచ్చి మరీ బంగారం లేదా వజ్రాలతో తయారు చేయించుకునే గడియారాలు, బ్రేస్‌లెట్లు సెలబ్రిటీలు వాడటం కొత్తేమీ కాదు. పెద్ద పెద్ద వాళ్ళను కలవటానికి వెళ్ళినప్పుడు.. లేదా ఏదైనా పెద్ద ఈవెంట్‌కు అటెండ్ అయినప్పుడు.. అందరి కళ్ళలో పడేలా సెలబ్రిటీలు ఇలాంటి వాటిని ధరిస్తుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా.. కొన్ని సందర్భాల్లో ఇవి ధరించటం అనేది స్టేటస్ సింబల్‌గా సెలబ్రిటీలు భావిస్తారు.
