HomeINTERNATIONAL NEWSఅమెరికా ఆయుధాలు ఖాళీ.. లక్షల కోట్ల డాలర్లు బూడిద : షాకింగ్ రిపోర్ట్

అమెరికా ఆయుధాలు ఖాళీ.. లక్షల కోట్ల డాలర్లు బూడిద : షాకింగ్ రిపోర్ట్

Published on

Latest articles

తల్లిదండ్రులు ప్రభుత్వ అధికారులైతే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు-సుప్రీంకోర్ట్

క్యాస్ట్ రిజర్వేషన్ల సిస్టమ్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయినప్పుడు.....

అమెరికా ఆయుధాలు ఖాళీ.. లక్షల కోట్ల డాలర్లు బూడిద : షాకింగ్ రిపోర్ట్

ప్రంపంచంలోని అత్యాధునిక ఆయుధాలున్న దేశం.. ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ వన్ దేశం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ఇవన్నీ అమెరికాకు...

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు సిరీస్‌లు ఇవే

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. సినిమాలు సిరీస్‌లు కలిపి మొత్తం 30 వరకు...

ప్రంపంచంలోని అత్యాధునిక ఆయుధాలున్న దేశం.. ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ వన్ దేశం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ఇవన్నీ అమెరికాకు ఉన్న మారుపేర్లు. అమెరికా అభివృద్ధికి కావాల్సిన వనరులు ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసి.. ప్రభుత్వాలను పడగొట్టి.. శాంతి స్థాపన పేరుతో ఆ దేశంలో అడుగుపెట్టి.. ఆ దేశంలోని వనరులను దోచుకోవటం అమెరికా నైజం. పైకి కనిపిస్తున్న అభివృద్ధి చెందిన అమెరికా వెనుక.. ఎన్నో దేశాలను విధ్వంసం చేసిన చరిత్ర ఉంది. తాను కాకుండా మరే దేశమూ అభివృద్ధి చెందటం అనేది అమెరికాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. తాజాగా మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధానికి కారణం కూడా ఇదే. ఏనాటికైనా సొంతంగా న్యూక్లియర్ వెపన్స్ అభివృద్ధి చేసుకోవాలనేది ఇరాన్ లక్ష్యం. కానీ.. ఏ దేశమైనా సరే న్యూక్లియర్ టెక్నాలజీ తయారు చేసుకోవటం అనేది అమెరికాకు నచ్చదు. అలా అన్ని దేశాలు న్యూక్లియర్ పవర్ సాధిస్తే ఇక అమెరికా గొప్పతనం ఏముంటుంది.. అందుకే ఇరాన్ పై యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్‌న సర్వనాశనం చేశామని చెప్తున్న అమెరికా.. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోపల ఉన్నది మాత్రం డొల్లే.

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా భారీగా డబ్బును ఆయుధాలను అందజేసి రష్యాను ఓడించాలని ప్రయత్నించింది. కానీ ఈ క్రమంలో అమెరికా తన లక్షల కోట్ల సంపదను భారీ ఆయుధ నిల్వలను కోల్పోయింది. రష్యాతో పోటీ పెట్టుకొని తనను తాను నాశనం చేసుకుంది అమెరికా. ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం చేస్తూ అత్యాధునిక మిసైళ్ళను ప్రయోగిస్తూ కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను కోల్పోయింది. దశాబ్ధాలుగా లక్షల కోట్ల డాలర్లు వెచ్చించి తయారు చేసుకున్న అమెరికా ఆయుధాలు సగానికి పైగా ఖాళీ అయిపోయనట్టు సంచలన రిపోర్ట్ బయటపడింది. ఇక ఇరాన్ చేసిన ప్రతి దాడుల్లో అమెరికాకు చెందిన వేల కోట్ల డాలర్లు విలువ చేసే అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలు నాశనం అయ్యాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం అని ట్రంప్ ప్రకటించటం వెనుక అసలు కారణం.. ఆయుధ డిపోలు వేగంగా ఖాళీ అయిపోవటమే అని స్థానిక మీడియా చెప్తోంది. యుద్ధంలో ఏమాత్రం వెనుకడుగు వేయని ఇరాన్‌పై ఇంకా దాడులు కొనసాగించి ఆయుధాలను కోల్పోవటం తప్ప.. ఇరాన్‌పై గెలుపు సాధించటం అసాధ్యమని నిపుణులు ట్రంప్‌ను హెచ్చరించారని తెలుస్తోంది.

బిలియన్‌ డాలర్ల విలువైన యూఎస్‌కు చెందిన అత్యాధునిక ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ లను టెహ్రాన్‌ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఇరాన్‌ దాడుల్లో యూఎస్‌ దాదాపు 30 డ్రోన్‌లను కోల్పోయింది. ఇందులో కొన్ని దెబ్బతిన్నవి కాగా.. వాటిని తిరిగి ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇవి ఘర్షణకు ముందు పెంటగాన్‌ వద్ద ఉన్న డ్రోన్‌ నిల్వల్లో దాదాపు 20 శాతానికి సమానం. ఇందులో చాలా డ్రోన్‌లను ఇరాన్‌ గాల్లోనే కూల్చివేసింది. మరికొన్ని క్షిపణి దాడుల్లో నేలపై ధ్వంసమయ్యాయి. ఈ ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్ ఒక్కొక్కటి సుమారు 30 మిలియన్‌ డాలర్ల వరకు ఖర్చవుతోంది. వీటిల్లో అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఇరాన్‌తో యుద్ధంలో యూఎస్‌ దళాలు ఈ డ్రోన్‌లను విరివిగా ఉపయోగించాయి. ప్రస్తుతం ఈ రీపర్‌ డ్రోన్‌ల ఉత్పత్తి ఆగిపోవడం యూఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ. ఇరాన్‌ పై అమెరికా 200కు పైగా థాడ్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్‌ మిసైల్‌-3, స్టాండర్డ్‌ మిసైల్‌-6లను వినియోగించింది. దీంతో పెంటగాన్‌ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్‌ నిల్వలు సగానికి పడిపోయాయి. అమెరికా వద్ద ఇంకా సుమారు 200 థాడ్‌ ఇంటర్‌సెప్టర్‌లు మాత్రమే మిగిలిఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంత భారీస్థాయిలో క్షిపణులు వినియోగించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది అమెరికా- ఇజ్రాయెల్ సైనిక సమన్వయలోపాన్ని ఎత్తిచూపుతోందన్నారు. ఇక, యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్‌సెప్టర్‌లు, 90 డేవిడ్‌ స్లింగ్‌లను వాడింది. వీటిలో కొన్ని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న యెమెన్‌, లెబనాన్‌ల నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగించింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దాదాపు దివాలా తీసిందని.. మహా అయితే ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే దాకా అమెరికా దివాలా తీసిన విషయాన్ని దాచగలడనీ.. ఆ తర్వాత అయినా అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ప్రపంచానికి తెలియక తప్పదని నిపుణులు చెప్తున్నారు.

FOLLOW US

More like this

తల్లిదండ్రులు ప్రభుత్వ అధికారులైతే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు-సుప్రీంకోర్ట్

క్యాస్ట్ రిజర్వేషన్ల సిస్టమ్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయినప్పుడు.....

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు సిరీస్‌లు ఇవే

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. సినిమాలు సిరీస్‌లు కలిపి మొత్తం 30 వరకు...

దృశ్యం 3 : రివ్యూ

దృశ్యం, దృశ్యం2 సినిమాలు అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచిన విషయం తెలిసిందే. అదే జానర్‌లో...