Home TELANGANA నేనే నా కొడుకును జైలుకు పంపించా-బండి సంజయ్

నేనే నా కొడుకును జైలుకు పంపించా-బండి సంజయ్

0
6

పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ప్రస్తుతం అరెస్టై జైళ్ళో ఉన్న విషయం తెలిసిందే. భగీరథ్‌తో పాటు అతడి స్నేహితుల విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయనీ.. అతడిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు పోలీసులు నమోదు చేశారనీ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్షాల నుంచి బండి సంజయ్‌పై విమర్శల దాడి మరింత పెరిగింది. బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. వారి విమర్శలపై ఎట్టకేలకు బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన కుమారుడిపై ఆరోపణలు వచ్చిన వెంటనే నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నాలు చేశాననీ.. కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత తానే స్వయంగా తన కుమారుడిని పోలీసులకు అప్పగించాననీ బండి సంజయ్ చెప్పారు. కోర్టులు న్యాయవ్యవస్థపై నమ్మకంతోనే తానే స్వయంగా తన కుమారుడిని పోలీసులకు అప్పగించాననీ.. ఇప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడు కూడా తానే స్వయంగా తన కుమారుడిని పోలీసులకు అప్పగించిన సందర్భం లేదన్నారు. ఏ తండ్రీ చేయని విధంగా తన కుమారుడి విషయంలో తాను చేశానన్నారు.

తనపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ వారిపై బండి సంజయ్ ప్రతివిమర్శలు చేశారు. బీజేపీలో తన స్థాయి ఏమిటో.. తాను ఎంతటి క్రమశిక్షణ గల కార్యకర్తనో పార్టీలో అందరికీ తెలుసు అనీ.. ప్రతిపక్షాల విమర్శలతో నిజాలు అబద్ధాలు కావనీ చెప్పారు. తాను ఓ లక్ష్యం మరియు సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని అని చెప్పిన బండి సంజయ్.. తాను చనిపోయిన తర్వాత తన మృతదేహంపై బీజేపీ జెండా కప్పాలని కోరుకునే సిన్సియర్ కార్యకర్తనని చెప్పుకొచ్చారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలికి రావాలని కోరుకుంటున్నానని చెప్పిన బండి సంజయ్.. తన కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడన్న ఆశాభావంతో ఉన్నట్టు కనిపించారు

No comments

Leave a reply

Please enter your comment!
Please enter your name here