బండి భగీరథ్.. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు నేషనల్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న పేరు ఇది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై.. ప్రస్తుతం అతడు జైళ్ళో ఉన్న విషయం తెలిసిందే. మైనర్ బాలికను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలతో పాటు ఇంకా చాలా వివాదాస్ఫద విషయాలు వెలుగులోకి వచ్చాయి. భగీరథ్ పై వచ్చిన ఆరోపణలతో బండి సంజయ్‌కు పొలిటికల్ హీట్ తగిలినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేశారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి కలిసి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ ఆరోపిస్తే.. బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన ప్రత్యర్థులు దొరికిందే అవకాశంగా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొడుకు చేసిన పనికి అప్రతిష్ట మూటగట్టుకున్న బండి సంజయ్‌పై బీజేపీ జాతీయ అధిష్టానం ఆగ్రహంతో ఉందనీ.. త్వరలోనే బండి సంజయ్‌కు పదవీ గండం తప్పదనీ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బండి సంజయ్ తన సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ మరియు తన కుమారుడు చేసిన పని వల్ల దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట మసకబారిందంటూ బీజేపీ సీనియర్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా జాతీయ రాజకీయాల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. మోదీ మంత్రివర్గం ఏర్పాటు జరిగి ఇప్పటికే రెండేళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగనుందని ఆ వార్త సారాంశం. పనితీరు బాగాలేని సుమారు 20 మంది మంత్రులకు పదవీ గండం పొంచి ఉందని బీజేపీ జాతీయవర్గాల్లో వినిపిస్తున్న అంశం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వల్ల ఏర్పడిన అప్రతిష్టను పోగొట్టుకోవటం.. భవిష్యత్తులో అద్భుతమైన ఇంధన వ్యవస్థను శాశ్వతంగా నిర్మించటం.. లాంటి విషయాలపై మోదీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోందనీ.. ఇలాంటి చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని ఒక కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటానికి చర్యలు చేపట్టనుందనీ తెలుస్తోంది. ఈ క్రమంలోనే పదవీ గండం ఉన్న వాళ్ళ పేర్ల జాబితాలో బండి సంజయ్ పేరు ఇప్పటికే ఖరారైందని సమాచారం. బండి భగీరథ్‌పై రోజురోజుకూ కొత్త సెక్షన్ల కింద కేసులు నమోదు కావటం.. అతడి స్నేహితుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతూ ఉండటం.. బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదంగా పరిణమిస్తున్నాయనేది నిజం



