తలా ధోనీ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడతాటా.. ఎప్పుడెప్పుడు అతడి బ్యాటింగ్ చూద్దామా అని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోనీ ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మాట మనకు తెలిసిందే. లేటెస్ట్ గా సోమవారం జరిగిన సీఎస్కే సన్ రైజర్స్ మ్యాచ్‌లో ధోనీ బరిలో దిగటం ఖాయం అని చాలా మంది భావించారు. కానీ ధోనీ రాలేదు.. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరితో కలిసి ఫోటోలు దిగి ఫ్యాన్స్‌కు కొంత సంతోషాన్నిచ్చాడు. అయితే.. ఈ సందర్భంగా ధోనీ నోటి నుంచి వచ్చిన ఓ మాట అతడి ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. సీఎస్కే సన్ రైజర్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ధోనీతో సురేష్ రైనా కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో రైనా ధోనీతో మాట్లాడుతూ నువ్వు వచ్చే సీజన్‌లో ఖచ్చితంగా ఆడాలి.. మేమంతా దాని కోసమే వెయిటింగ్ అని చెప్పగా… అందుకు బదులిచ్చిన ధోనీ.. మైదానంలో క్రికెట్ ఆడటానికి శరీరం సహకరించటం లేదు అంటూ రియాక్ట్ అయ్యాడు. ఫిట్ నెస్‌కు మారుపేరు అయిన ధోనీ.. తనకు శరీరం సహకరించటం లేదు అని మాట్లాడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేసింది. గ్రౌండ్‌లో హపర్ యాక్టివ్ గా ఉండే ధోనీ.. ఫ్రాక్షన్ ఆఫ్ సెకెన్‌లో రియాక్ట్ కావటంలో ఎక్స్‌పర్ట్. మ్యాచ్ మొత్తం వికెట్ కీపింగ్ చేసిన తర్వాత కూడా ఏమాత్రం అలసిపోకుండా బ్యాటింగ్ చేయటంలో ధోనీ ఆరితేరిన వాడు. అంతటి ఫిట్ నెస్ మెంయిటెన్ చేసే ధోనీ నోటి వెంట శరీరం సహకరించటం లేదనే మాట రావటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే.. ధోనీ మాటను మాత్రం సురేష్ రైనా అంగీకరించలేదు. ధోనీ మాటకు రిప్లై ఇస్తూ.. అదంతా మాకు తెలియదు.. ఏది ఏమైనా వచ్చే సీజన్లో నువ్వు ఆడాలి.. మా అందరి కోరిక ఇది.. అంటూ ధోనీకి క్లారిటీ ఇచ్చాడు రైనా. ధోనీ ఆడకపోవటంపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా స్పందించాడు. ధోనీ ఆడాలనే మేం కోరుకుంటామనీ.. కాకపోతే ధోనీ చేత ఆడించాలా వద్దా అనేది కేవలం ధోనీ మరియు మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. సీఎస్కేపై సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ విజయం సాధించటంతో ఆ టీమ్‌కు ప్లే ఆఫ్‌లో బెర్త్ ఖరారైంది. అటు గుజరాత్ టైటాన్స్ టీమ్ కూడా సన్ రైజర్స్‌తో సమానంగా 16 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. మిగిలిన ఒక్క ప్లే ఆఫ్ బెర్త్ కోసం ఏకంగా 5 టీమ్స్ పోటీలో ఉండటంతో ఈ సీజన్ వచ్చే మ్యాచ్‌లు మరింత ఇంట్రస్టింగ్‌గా ఉండబోతున్నాయి



