ముందు ఫ్రీ ఆఫర్ ఇవ్వటం.. కోట్లాది మంది కస్టమర్లకు దగ్గరైన తర్వాత నెలవారీ ఆఫర్లు పెట్టి ఆ కస్టమర్లకు శాశ్వత కస్టమర్లుగా మార్చుకోవటం.. రిలయన్స్ జియో పాటించే అతిపెద్ద వ్యాపార మ్యాజిక్ ట్రిక్ ఇది. వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఐపీఎల్ సీజన్ ను పూర్తిగా ఫ్రీగా ప్రేక్షకులకు చూపించింది రిలయన్స్ జియో సినిమా.. అది కూడా 4కే రిజల్యూషన్ తో. ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమానీ జియో సినిమా కోట్లాది ప్రేక్షకుల ఫోన్లలోనూ, టీవీల్లోనూ ప్లేస్ సంపాదించేసింది. ఇప్పుడు అసలు బిజినెస్ షురూ చేసేందుకు రెడీ అవుతోంది జియో సినిమా. అందుకు పెద్ద వ్యూహమే పన్నింది.. ఏకంగా తెలుగు ఓటీటీ మార్కెట్ మొత్తంపై కన్నేసింది. ఇంటర్నేషనల్ రేంజ్ లో పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్న తెలుగు సినిమా ఓటీటీ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు రిలయన్స్ జియో సినిమా ప్లాన్ రెడీ చేసింది.
రాబోయే రోజుల్లో అమేజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా వంటి ఓటీటీలకు పోటీగా పెద్ద మరియు చిన్న సినిమాలన్నింటినీ కొనేయాలని జియో ప్లాన్ చేసిందని సమాచారం. ప్రస్తుతానికి ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, ఆహా మాత్రమే ఎక్కువగా తెలుగు సినిమాలు విడుదల చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికలు. ఇక సోనీ లివ్, జీ5 వంటివి వాటి తర్వాతే. కాబట్టి ముందు ఫస్ట్ మూడు స్థానాల్లో ఉన్న వాటిని దెబ్బకొట్టి.. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలను కొనేసి.. జియో సినిమా ఓటీటీలో పడేస్తే.. ఆ తర్వాత మార్కెట్లో ఫస్ట్ ప్లేస్ జియో సినిమాదే అవుతుంది. సో.. ప్రస్తుతం జియో సినిమా తెలుగు సినిమాలను ఎంతైనా సరే ఇచ్చేసి కొనుక్కోటానికి ప్లాన్ రెడీ చేస్తోందట. అంతే కాకుండా సొంతంగా తెలుగులో హార్రర్, థ్రిల్లర్ జానర్లలో వెబ్ సిరీస్ లు ప్రొడ్యూస్ చేయాలని కూడా నిర్ణయించుకున్నదని సమాచారం. జియో సినిమా కనుక ఓన్ ప్రొడక్షన్ మొదలు పెడితే.. అది మిగతా ఓటీటీలకు చాలా పెద్ద కాంపిటిషన్ అవుతుంది. ఇక తెలుగు సినిమాలన్నీ ఎక్కువ మొత్తంలో కొనేస్తే జియో సినిమా ఓటీటీ మార్కెట్లో నెంబర్ వన్ కావటం పక్కా.