మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. సాధారణంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఫాలోయర్స్ పెంచుకోవటం కోసమో.. ప్రేక్షలు అటెన్షన్ గ్రాబ్ చేసి వైరల్ కావటం కోసమో.. లేక అలా ర్యాండమ్ ఫోటోలు షేర్ చేసే అలవాటులో భాగంగానో అందగత్తెలు అప్పుడప్పుడు తమ అందాలు ఆరబోస్తుంటారు. లేటెస్ట్‌గా మీనాక్షి కూడా అది పని చేసింది. అచ్చ తెలుగు సాంప్రదాయంలో భాగమైన చీరకట్టులో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. చేతిలో పుస్తకం.. పెన్ను పట్టుకొని ఏదో చదువుతున్నట్టు.. ఏదో రాస్తున్నట్టు అందమైన ఫోజులిచ్చింది. ఏమాత్రం గ్లామర్ డోస్ లేకపోయినా.. సింపుల్‌గా చీరలోనే కనిపించింది మీనాక్షి. ఈ ఫోటోలను చూసిన ఆమె ఫ్యాన్స్.. ఆమె సింపుల్ అందానికి ఫిదా అయిపోయారు. ఆ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మెన్షన్ చేస్తున్నారు. దీంతో మీనాక్షి చౌదరి కొత్త ఫోటో షూట్ ఫోటోలు టాలీవుడ్‌లో వైరల్ అయ్యాయి.
కొంత మంది ఫ్యాన్స్ మరో మెట్టు ఎక్కి మీనాక్షిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఒకరు కామెంట్ చేస్తే.. మీనాక్షి మ్యాజిక్ అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొంత మంది ఫ్యాన్స్ ఏకంగా మీనాక్షి అందాన్ని వర్ణిస్తూ కవితలు రాసేసి పోస్ట్ చేస్తున్నారు. మీరు చీరలో చాలా అందంగా ఉన్నారు అని ఒకరంటే.. మీరు మా అమ్మకి కోడలుగా వస్తారా అంటు మరొకరి సిల్లీ కామెంట్లు పెట్టేస్తున్నారు. హార్ట్ సింబల్స్.. ముద్దు సింబల్స్‌కు అయితే కొదవే లేదు. ఒక్క ఫోటో షూట్‌తో లక్షలాది మందిని తన అందంతో ఫిదా చేస్తోంది మీనాక్షి. ఫ్యాన్స్ మరిచిపోకుండా ఉండాలంటే.. అప్పుడప్పులు ఇలాంటి గ్లామర్ ట్రీట్ ఇవ్వక తప్పదు.. అప్పుడే టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారి మరి







