భారీ అంచనాల మధ్య కోట్లాది మంది అభిమానుల కోసం ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది ట్రైలర్ సోమవారం సాయంత్రం అట్టహాసంగా ముంబైలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే పెద్ది ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రైలర్ దూసుకెళ్తోంది. ఇదివరకటి సినిమాల్లోకంటే ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా డిఫరెంట్‌గా కనిపించాడు. మల్లయుద్ధ వీరుడి అవతారంలో ఆకట్టుకునే బాడీతో ప్రేక్షకులకు షాకిచ్చాడు చెర్రీ. తన గెటప్ గురించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశాడు చరణ్. బాలీవుడ్‌లో విడుదలై బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సల్మాన్ ఖాన్ సుల్తాన్.. అమీర్ ఖాన్ దంగల్ సినిమాల ఇన్‌స్పిరేషన్ తోనే తాను ఈ సినిమాలో ముందుకెళ్ళాననీ.. సల్మాన్ అమీర్ తనకు సరికొత్త దారి చూపించారంటూ వారిద్దరినీ ఆకాశానికెత్తేశాడు రామ్ చరణ్.
ప్రేక్షకుల అంచనాలకు మించే విధంగా రామ్ చరణ్‌ను స్క్రీన్ మీద చూపించాడు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. దీంతో దేశ విదేశాల్లో పెద్ది సినిమా మార్కెట్ ఊహించని రీతిలో పెరిగిపోయింది.
ఇప్పటికే టీజర్, గ్లింప్స్, సాంగ్స్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌లో సంచలన రికార్డులతో వార్తల్లో నిలిచింది. ఇంతకీ పెద్ది ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో సాగుతోంది. 1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక సాధారణ యువకుడు స్పోర్ట్స్‌ను ఆయుధంగా చేసుకుని సమాజాన్ని ఏకం చేసే విధానం ప్రధానాంశంగా ఉండనుందని సమాచారం. ఈ కథలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషనల్ కోర్ కూడా ఉంటుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఇదే ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పెద్ది బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 100,000 అమెరికన్ డాలర్లు క్రాస్ చేసి, తర్వాత వరుసగా 250,000 అమెరికన్ డాలర్లు 300,000 అమెరికన్ డాలర్ల మైలురాళ్లను దాటింది. ఇక తాజా ట్రేడ్ అప్‌డేట్స్ ప్రకారం.. పెద్ది నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్ 350,000 అమెరికన్ డాలర్ల మార్క్‌ను దాటడం విశేషం. అంటే దాదాపు 3 కోట్లు దాటింది. దీంతో రామ్ చరణ్ ఓవర్సీస్ స్టామినా మరోసారి రుజువైంది.
ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ నంబర్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా. భారీ స్టార్ క్యాస్టింగ్, టాప్ టెక్నికల్ టీమ్ అన్ని కలిసి ‘పెద్ది’ని ఒక గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ఓవర్సీస్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. నార్త్ అమెరికాలో 450కు పైగా లొకేషన్లలో, 1300కు పైగా షోలతో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జూన్ 3న ప్రీమియర్ షోలు, జూన్ 4న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్‌లోని రామ్ చరణ్ స్పీచ్ వీడియో లింక్



