Home AP NEWS అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

0
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

నారా లోకేష్ కుప్పం పాదయాత్ర మొదటి రోజునే గుండెపోటుకు గురైన తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నాడు. సివియర్ కార్డియాక్ అరెస్ట్ కు తారకరత్న లోనయ్యాడనీ.. ప్రస్తుతం అత్యుత్తమ వైద్యులతో చికిత్స కొనసాగిస్తున్నామనీ చెప్పిన వైద్యులు.. ఇప్పటికైతే ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పాల్సి వస్తుందంటూ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా నారా లోకేష్ ఏపీలో సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. కుప్పంలో నిన్న ప్రారంభమైన ఈ యువగళం కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న.. పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య అసౌకర్యానికి లోనై స్పృహ కోల్పోయాడు. కుప్పంలోని స్థానిక హాస్పిటల్ లో చేర్చగా వైద్యులు గుండెపోటు వచ్చినట్టు చెప్పారు. ప్రథమ చికిత్స అనంతరం నిన్ననే తారకరత్నను బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here