టాలీవుడ్ యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ కు అత్యుత్తమ్మ సంగీత పురస్కారం లభించింది. ఇండియాలో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్ స్టార్ డస్ట్ 50 సంవత్సరాల వేడుకల సందర్భంగా అవార్డులను ప్రకటించింది. 50వ వార్షికోత్సవ అవార్డులలో దేవిశ్రీకి “ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు మ్యూజిక్ ఇన్ ఇండియన్ సినిమా” అవార్డును స్టార్ డస్ట్ ప్రకటించింది. భారతీయ సంగీతానికి దేవిశ్రీ అందించిన అత్యుత్తమ సేవలకు గానూ ఈ అవార్డు వరించింది. ఈ విషయాన్ని దేవిశ్రీ తన ట్విటర్ అకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
చిన్న వయసులోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. అదిరిపోయే మాస్ సాంగ్స్ తో పాటు ఎక్కువ కాలం గుర్తుండిపోయే మెలొడీ ట్యూన్లను అందించటంలో దేవిశ్రీది అందెవేసిన చేయి. రాక్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునే దేవిశ్రీ.. లేటెస్ట్ గా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు మ్యూజిక్ అందజేశాడు. దేవిశ్రీకి అవార్డు రావటం పట్ల సోషల్ మీడియాలో దేవీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.