HomeFILM NEWSగాయని వాణీ జయరాం ఇక లేరు

గాయని వాణీ జయరాం ఇక లేరు

Published on

Latest articles

బీజేపీని వణికించిన కాక్రోచ్ జనతా పార్టీ.. కోటిన్నర ఫాలోవర్లున్న అకౌంట్ ఇప్పుడు బ్లాక్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఓ కేసులో భారతదేశపు యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక...

ఎబోలా వైరస్ ముంచుకొస్తోంది.. భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ సీరియస్ వార్నింగ్

కరోనా వైరస్.. ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని దారుణ పరిస్థితులను నేటి తరానికి పరిచయం చేసిన మహమ్మారి. ఇంట్లో...

తమిళనాడు మంత్రులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న విజయ్

ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకొని తమిళనాడు రాజకీయ చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని తనపేరిట...

కొత్త సంవత్సరం సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత నెల రోజుల నుంచి సినీ ప్రముఖుల మరణ వార్తలు వింటున్న తెలుగు వారికి నేడు మరో ‌విషాద వార్త. అలనాటి అద్భుత గాయని వాణీ జయరాం తుదిశ్వాస విడిచారు. చెన్నై లోని తన ఇంట్లో ఆమె ఈ రోజు ఉదయం మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 78 యేళ్ళ వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించారు. కుటుంబంలో 5వ సంతానంగా జన్మించిన వాణీ అసలు పేరు కలైవాణి. అతి చిన్న వయసులోనే కచేరీ నిర్వహించి అలనాటి సంగీత విధ్వాంసులచే ఔరా అనిపించుకున్నారు వాణీ జయరాం. పూర్తిగా చెన్నైలోనే చదువుకున్న ఈమె అన్ని దక్షిణ భారత భాషలను అద్భుతంగా మాట్లాడగలదు.
ప్లేబ్యాక్ సింగర్ గా వాణీ జయరాం ఓ తరాన్ని ఏలిన అతికొద్ది మందిలో ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో పాటు హిందీ వంటి ఉత్తర భారత భాషల్లో కూడా పాటలు పాడిన వాణీ జయరాం.. మొత్తం 14 భాషల్లో సుమారు 20 వేలకు పైగా పాటలు పాడారు. 80 వ దశకం మరియు 90వ దశకాలలో ఈమె పాడిన పాటలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ వాణీ పాడిన పాటలు అలనాటి ఆణిముత్యాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి వాణఈ జయరాం పాడిన పాటలు ఇప్పటికీ అజరామరాలే. సీతాకోకచిలుక సినిమాలోని మాటే మంత్రము పాట వందేళ్ళైనా చెరగని అనుభూతినిచ్చే పాటగా ఆమె అభిమానులు చెప్పుకుంటారు. తన తేనె గొంతుకతో కోట్లాది మందిని అలరించిన వాణీ జయరాం మరణం.. సౌత్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి.

FOLLOW US

More like this