తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంలో హైకోర్టులో రిటి పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసును సోమవారం మధ్యాహ్నం విచారించిన హైకోర్టు.. బుధవారానికి వాయిదా వేసింది. పిటిషన్ కు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మంలోని సాగుభూములలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్తూ.. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను విడుదల చేసింది. దీంతో తమ పొలాలు పోతాయంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. యేడాదికి రెండు పంటలు పండే భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటమేమిటంటూ బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా ఆందోళన చేశారు. రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రైతులతో కలిసి ధర్నా చేయటం.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించటంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం.. తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించింది. అయితే.. ఈ మాస్టర్ ప్లాన్ కేవలం ప్రతిపాదన మాత్రమేననీ.. ఇది తుది నిర్ణయం కాదనీ అధికారులు చెప్తున్నారు.