కొద్ది సేపటి క్రితం ప్రారంభమైన వుమెన్ ప్రీమియర్ లీగ్ వేలం పాటలో ఇండియన్ ప్లేయర్లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. అత్యధికంగా స్మృతి మంధానను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. మరో ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబై ఇండియన్స్ 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. స్మృతి మంధాన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లీ గార్డ్నర్ ను 3.2 కోట్లకు గుజరాత్ జియంట్స్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జరిగిన వేలంపాటలో వీరే టాప్ లో ఉన్నారు. మూడో స్థానంలో ఇంగ్లాండ్ కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ ను 1.8 కోట్లకు యూపీ వారియర్స్ కొనుగోలు చేయగా.. హర్మన్ ప్రీత్ కౌర్ తో సోఫీ మూడో స్థానాన్ని పంచుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలిసీ పెరీని రాయల్ చాలెంజర్స్ బ్యాంగ్లోర్ 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజీలాండ్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్ ను ఆర్సీబీ 50 లక్షలకు దక్కించుకుంది. ప్రస్తుతానికి వేలంపాట జోరుగా కొనసాగుతోంది. ఐపీల్ కు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ప్లేయర్ల ఆక్షన్ కొనసాగుతోంది.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023.. మార్చి 4న ప్రారంభమై మార్చి 26 వరకు జరగనుంది. మొత్తం 22 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సీజన్ కు సంబంధించిన వేలం పాట ప్రక్రియ ఈ రోజు ఉదయం ముంబైలోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్ లో గల జియో కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైంది. మొత్తం డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు ముంబైలోనే జరగనున్నాయి.
