HomeTELANGANAబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తప్పిన ప్రమాదం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తప్పిన ప్రమాదం

Published on

Latest articles

బీజేపీని వణికించిన కాక్రోచ్ జనతా పార్టీ.. కోటిన్నర ఫాలోవర్లున్న అకౌంట్ ఇప్పుడు బ్లాక్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఓ కేసులో భారతదేశపు యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక...

ఎబోలా వైరస్ ముంచుకొస్తోంది.. భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ సీరియస్ వార్నింగ్

కరోనా వైరస్.. ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని దారుణ పరిస్థితులను నేటి తరానికి పరిచయం చేసిన మహమ్మారి. ఇంట్లో...

తమిళనాడు మంత్రులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న విజయ్

ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకొని తమిళనాడు రాజకీయ చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని తనపేరిట...

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రమాదం తప్పింది. గురువారం అసెంబ్లీకి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో రాజాసింగ్ ఉపయోగించే కారు టైర్ ఊడిపోయింది. ధూల్ పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. కారు తక్కువ స్పీడుతో వెళ్తుండటంతో ప్రమాదం జరగలేదు. దీంతో రాజాసింగ్ వేరే కారు తెప్పించుకొని అందులో వెళ్ళిపోయారు. కారు నడిరోడ్డుపై అలాగే ఉండిపోయింది. అయితే.. రాజాసింగ్ కారు మొరయించటం ఇది కొత్తేమీ కాదు. గతంలో రెండు సార్లు ఇలాగే కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. అప్పుడు కూడా రాజాసింగ్ పరిస్థితి ఇదే. వేరే కారు తెప్పించుకొని అందులో వెళ్ళిపోయేవాడు.
ఈ కారును ప్రభుత్వమే కేటాయించిందనీ.. కారు పరిస్థితి ఏమీ బాగాలేదని ఎన్నోసార్లు తాను ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకుండా ఇదే పాత బుల్లెట్ ప్రూఫ్ కారును రిపేర్ చేయించి ఇస్తోందనీ రాజాసింగ్ పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత ఓ ఆడియో విడుదల చేసిన రాజాసింగ్.. తన కారును మార్చాలని ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదనీ.. ఇప్పటికైనా కారు మార్చాలనీ కోరారు. “ధూల్ పేటలో ఉన్న కాబట్టి ఏం కాలే.. అదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది.. ఇప్పటికైనా బండి మార్చండి.. లేకపోతే మీ బండి మీరు తీస్కోండి..” అంటూ రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

FOLLOW US

More like this