Home INTERNATIONAL NEWS ఇరాన్‌పై సడన్ అటాక్‌కు ట్రంప్ సీక్రెట్ ప్లాన్

ఇరాన్‌పై సడన్ అటాక్‌కు ట్రంప్ సీక్రెట్ ప్లాన్

0
2

ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నామంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించి నాలుగు రోజులు కాకముందే.. సడన్ అటాక్ చేసి ఇరాన్‌కు తీవ్ర నష్టం కలిగించేందుకు అమెరికా ప్లాన్ చేస్తోందంటూ వచ్చిన వార్తలు మళ్ళీ మిడిల్ ఈస్ట్‌లో హీట్ పుట్టించాయి. ఇరాన్‌పై మెరుపు దాడికి అమెరికా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయన్న వార్తలు వెలువడిన మరుక్షణమే ముందు జాగ్రత్తగా ఇరాన్ తన ఎయిర్ స్పేస్‌ను మూసివేసింది. ప్యాసింజర్ విమానాలు, కార్గో విమానాలు గాల్లోకి ఎగరకుండా ఇరాన్ ప్రభుత్వం ఆర్జర్స్ పాస్ చేసింది. ఈ నెల 25 వరకూ ఈ ఆర్డర్స్ అమలులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటమ్‌ జారీ చేసే సమయంలో ఖతార్‌ ప్రభుత్వానికి చెందిన ఓ వీఐపీ విమానం ఇరాన్‌ ఎయిర్ స్పేస్‌ను దాటింది. ఆ విమానం శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం టెహ్రాన్‌కు వచ్చిన ఖతార్‌ ప్రతినిధి బృందానికి చెందినదిగా ఇరాన్ చెప్తోంది. ఇరాన్‌పై దాడులను పూర్తిగా నిలిపి వేస్తున్నామనీ.. ఆ దేశంలో శాంతి ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామనీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అధికారికంగా ప్రకటించాడు. కానీ.. ఒక వేళ శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్ ఊహించని విధంగా భీకర దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగించాలని.. ఈ సారి ఇరాన్‌ ప్రతిదాడికి సిద్ధమయ్యే లోపే భారీ నాశనం సృష్టించాలనీ ట్రంప్ వర్గం ప్లాన్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

ట్రంప్ మళ్ళీ ఇరాన్‌పై దాడికి ప్లాన్ వేసినట్టు వచ్చిన వార్తలో ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్‌లో వాతావరణం వేడెక్కింది. ఎప్పుడు ఏ క్షణాన ఎటు వైపు నుంచి మిసైల్స్ దూసుకొస్తాయోనని ఇరాన్ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్ లోని కీలక ప్రాంతాలపై దాడి చేసేందుకు ట్రంప్ వర్గం ప్లాన్ చేస్తోందన్న వార్తల మేరకు ఇరాన్ మళ్ళీ యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయింది. ఓ వైపు ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతూ ఉండగానే మళ్ళీ యుద్ధ వాతావరణం ఏర్పడటంతో ఇరాన్ మిత్రదేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇరాన్ ఎప్పటికీ న్యూక్లియర్ శక్తిగా ఎదగకూడదు అనేది అమెరికా షరతు. ఇరాన్‌తో శాంతి ఒప్పందంలో కూడా ట్రంప్ అన్నింటి కంటే ముఖ్యంగా ఈ అంశాన్ని నొక్కి చెప్తున్నాడు. అణు పరీక్షలు చేయటం ఆపేస్తామని.. ఎప్పటికీ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయబోమనీ ఇరాన్ స్పష్టమైన ఒప్పందం చేసుకుంటే తప్ప ఇరాన్‌పై దాడిని ఆపే ప్రసక్తే లేదని ట్రంప్ తెగేసి చెప్తున్నాడు. ఇరాన్ న్యూక్లియర్ శక్తిగల దేశంగా ఎదగటాన్ని అటు ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒక వేళ ఇరాన్ గనుక అణ్వాయుధ దేశంగా ఎదిగితే.. అది ఎప్పటికైనా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ముప్పే. ఒక ఇస్లామిక్ దేశం వద్ద న్యూక్లియర్ ఆయుధాలు ఉండటం ప్రపంచానికి మంచిది కాదనేది అమెరికా ప్రధానమైన వాదన

No comments

Leave a reply

Please enter your comment!
Please enter your name here