యంగ్ యాక్టర్ విశ్వక్సేన్ కొత్త సినిమా దాస్ కీ ధమ్కీ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది మొదటి రెండు రోజుల్లో సుమారు 12 కోట్లు కలెక్ట్ చేసి విశ్వక్ కెరీర్ లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు విశ్వక్సేన్ హయ్యెస్ట్ ఓపనింగ్ కెలక్షన్లు హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాకు 1.35 కోట్లు కాగా.. ఇప్పుడు దానికి పదింతల కలెక్షన్లు వసూలు చేసింది. తానే దర్శకత్వం వహించటంతో పాటు స్వయంగా నిర్మించాడు విశ్వక్సేన్. హీరో మాస్ యాక్టింగ్ తో పాటు అదరగొట్టే యాక్షన్ సీన్లు, హీరోయిన్ గ్లామర్.. అన్నీ కలిసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మొత్తానికి విశ్వక్సేన్ ఓ మంచి కమర్షియల్ సినిమా తీసి సత్తా చాటాడు.
తానే సొంతంగా నిర్మించిన విశ్వక్సేన్.. ఈ సినిమా కోసం కనీసం 15 కోట్లు ఖర్చు పెట్టినట్టు ట్రేడ్ వర్గాల టాక్. ఇప్పటికే దాదాపు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసింది. ఇంకో వారం రోజులు కనుక సినిమా థియేటర్లలో ఇదే రేంజ్ లో ఆడితే విశ్వక్సేన్ దశ తిరిగిపోయినట్టే. తన కెరీర్ లో హయ్యెస్ట్ బ్లాక్ బస్టర్ గా సినిమా నిలిచిపోతుంది. ఇదివరకే చూసిన కథే అయినప్పటికీ విశ్వక్ తనదైన స్టైళ్ళో తెరకెక్కించిన విధానం బాగుందని ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ రావటం కూడా సినిమా మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి.