వరుణ్ తేజ్ టీమ్ గత కొన్ని రోజులుగా అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తోంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు స్పీడందుకున్నాయి. ఈ సందర్భంగా సినిమా మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఓ యుద్ధ విమానం ముందు వరుణ్ తేజ్ నిలబడి ఉన్న స్టిల్ ను రిలీజ్ చేశారు. అంటే.. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడన్నమాట. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే.. ఈ సినిమా టైటిల్ ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలను జోడించిన కథతో సినిమాను తెరకెక్కిస్తున్నామని సినిమా యూనిట్ చెప్తోంది. బడ్జెట్ కూడా భారీగానే ఉందట. వరుణ్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా నిలిచిపోతుందనీ..
ప్రేక్షకులు థ్రిల్ అయ్యే విజువల్ వండర్ గా సినిమాలో గ్రాఫిక్స్ ఉండబోతున్నాయనీ చెప్తున్నారు.
వరుణ్ పక్కన మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ నటిస్తోంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎయిర్ ఫోర్స్ ఆఫీసరే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు సహకారం అందించే రాడార్ ఆఫీసర్ అనే క్యారెక్టర్లో మానుషి కనిపించనుందని సమాచారం. సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.