భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం మొత్తం అటు వైపే చూస్తుంటుంది. సోషల్ మీడియాలో సుమారు 9 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు నిత్యం. భారత్ లోనే కాదు విదేశాల్లో కూడా మోడీపై విపరీతమైన అభిమానం కనిపిస్తూ ఉంటుంది. చాలా దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు మోడీ పాపులారిటీ చూసి ఆశ్చర్యపోతుంటారు. గతంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ఏ ఒక్కరికీ ఇంత పాపులారిటీ రాలేదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్.. మోడీకి ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చింది అనే దానిపై ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. మోడీకి ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చిందో.. ప్రపంచ వ్యాప్తంగా భారత్ మరియు మోడీకి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ఉన్నదో కథనంలో వివరించింది న్యూయార్క్ టైమ్స్.
ప్రధాని హోదాలో ఆయన భారత్ లో ప్రతి నెలా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఆయనకు పాపులారిటీ రావటానికి ప్రధాన కారణం అని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. ఈ కార్యక్రమం ద్వారా ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడటం.. ఆయన మాట్లాడే విధానంలో ఉండే వాక్చాతుర్యం.. ఎంచుకునే అంశం.. ఇలా ప్రతీదీ ఆయనకు ఉన్న ప్రజాదరణను పెంచేశాయట. డిజిటల్ పద్ధతులను, సోషల్ మీడియాను మోడీ ఆండ్ టీమ్ వాడుకునే పద్ధతి కూడా ఇంత పాపులారిటీ రావటానికి కారణమయ్యాయట. భారతదేశంలో జరిగే అన్ని పరిణామాలపై మోడీకి చాలా లోతైన అవగాహన ఉంటుందంటూ రాసుకొచ్చింది న్యూయార్క్ టైమ్స్. భారతదేశాన్ని ప్రపంచంతో మోడీ కనెక్ట్ చేసిన విధానం మరియు ప్రపంచ దేశాలతో భారత్ కు మోడీ ఇచ్చిన అత్యంత అద్భుతమైన విదేశాంగ విధానం.. భారత్ పేరు మారుమోగి పోయేలా చేయటం.. ఇలా చాలా అంశాలు మోడీని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా నిలబెట్టాయట.
రాహుల్ గాంధీ లాంటి నేతలు అమెరికా పర్యటనలో మోడీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన నేపథ్యంలో.. అమెరికా వార్తా సంస్థలు ఇలాంటి కథనాలు ప్రచరించటం గమనార్హం. మోడీ అమెరికా పర్యటనకు ముందే అమెరికాలో వివిధ ప్రదేశాల్లో మీటింగులతో ఊదరగొట్టిన రాహుల్.. భారత్ పరిస్థితి దిగజారిందనీ.. మోడీ పాలన బాగాలేదనీ.. ఇలా చాలా మాటలే మాట్లాడాడు. కానీ ఆ మాటలు ఎక్కడా ప్రభావం చూపలేకపోయాయి. పనిగట్టుకొని మోడీ పై దుష్ప్రచారం చేసినప్పటికీ పాపం రాహుల్ ఆండ్ టీమ్ కు చుక్కెదురైంది. ప్రస్తుతం మోడీకి ఉన్న పాపులారిటీ అనేది ఓ హాట్ టాపిక్.. టాక్ ఆఫ్ ది వరల్డ్..!!