Home AP NEWS సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లులు మాల్ స్కామ్

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లులు మాల్ స్కామ్

0
3

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు మాల్ గురించి ఇటీవల ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. లులు మాల్‌లో షాపింగ్ చేసి తినటానికి మిక్స్చర్ పొట్లం కొన్న ఓ యువతి.. సగం పొట్లం తిన్న తర్వాత అందులో బల్లిని చూసి షాకైంది. స్నాక్స్ ప్యాకెట్లో బల్లి ఉందని తెలియక సగం తినేసిన ఆ యువతి.. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందకు ఓ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తాను లులు మాల్‌లో మిక్స్చర్ పొట్లం కొన్నాననీ.. తీరం సగం తినేసిన తర్వాత అందులో చచ్చిన బల్లి కనిపించిందనీ బావురుమంది యువతి. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేయటంతో ఆ నోటా ఈ నోటా పాకి హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో మేల్కున్న సదరు అధికారులు.. అసలు లులు మాల్‌లో ఫుడ్ ప్రోడక్ట్స్ పరిస్థితి ఏంటో తేల్చేందుకు మాల్‌లో సోదాలకు వెళ్ళారు. మాల్‌లోని అన్ని తినే పదార్థాల ప్యాకెట్లను చెక్ చేసిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది. మాల్‌లోని అనేక రకాలైన ఫుడ్ ప్యాకెట్లలో పురుగులు ఉన్నాయనీ.. అసలు ఆ ప్రోడక్ట్స్‌లో ఏమాత్రం శుభ్రత లేదని తేల్చారు అధికారులు. డేట్ ఎక్స్‌పైర్ అయినా కూడా ఫుడ్ ప్యాకెట్లను పడేయకుండా అలాగే విక్రయిస్తున్నారని తేల్చారు.

విషయం అక్కడితో ఆగలేదు.. మాల్ మొత్తం తనిఖీ చేసిన అధికారులకు కళ్ళు బయర్లుకమ్మాయి. సగం కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లు.. ఎప్పటి నుంచో ఫ్రిజ్‌లో దాచిపెట్టిన రకరకాల ఆహార పదార్థాలు.. అసలు అమ్మటానికి పనికిరాని పాడైపోయిన రకరకాల పదార్థాలను అధికారులు గుర్తించారు. ఇలాంటి వస్తువులు ఫుడ్ సేఫ్టే అధికారులకు కనిపించకుండా జాగ్రత్తగా దాచి ఉంచారట మాల్ సిబ్బంది. డేట్ ఎక్స్‌పైర్ అయిపోయిన చాలా రకాల మసాలాలు ఇతర వంట సామాగ్రిని సగం ధరకు డిస్కౌంట్‌పై అమ్మేస్తున్నారనీ.. ఇంకా చాలా రకాలుగా వినియోగదారులను మోసం చేస్తున్నారనీ అధికారులు గుర్తించారు. అయితే.. తనిఖీలు పూర్తి అయినా కూడా అధికారులు ఇంకా లులు మాల్ అక్రమాలపై అధికారికంగా ఏ విషయాన్ని అనౌన్స్ చేయలేదు. లులు మాల్ స్కామ్ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుండటంతో జనాల్ అలర్ట్ అవుతున్నారు. సగం ధరకు మార్కెట్లో దొరికే వస్తువుల వెనుక స్కామ్ ఉందా లేదా నిర్ధారించుకున్నాక కొనటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎక్స్‌పర్ట్స్ చెప్పేదానిలో కూడా నిజం ఉందనేది మనం తెలుసుకోవాలి.. ఏ మాల్‌లో అయినా.. ఏ వస్తువు అయినా.. అమ్మేవాడు లాభం లేకుండా అమ్మడు అనేది నిజం.

No comments

Leave a reply

Please enter your comment!
Please enter your name here