పోక్సో కేసులో ప్రస్తుతం జైళ్ళో ఉన్న బండి భగీరథ్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగీరథ్ అరెస్టుకు ముందే ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు.. ఆ తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిచ్చింది. అంతే కాకుండా.. రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయటానికి కూడా అనుమతిచ్చింది. మరి కొద్ది గంటల్లోనే భగీరథ్ తరఫున లాయర్లు హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన కుమార్తెను లైంగికంగా వేధించాడంటూ బండి భగీరథ్‌పై బాలిక తల్లి మే 8న పేట్ బషీరాబాగ్ పోలీస్ స్టేషన్లో కేసు దాఖలు చేయగా.. కేసు స్వీకరించిన పోలీసులు భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మే 15న కేసును విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఆ తర్వాత భగీరథ్ కొద్ది రోజుల పాటు పోలీసులకు కనిపించకుండా పోగా.. అతడి కోసం గాలించిన పోలీసులు అతడి స్నేహితులను పట్టుకొని విచారించారు. స్నేహితుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయని చెప్పిన పోలీసులు భగీరథ్‌పై మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ప్రకటించారు. మే 16న భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం అతడు జైళ్ళో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసేకంటే ముందే కేసులో బెయిల్‌కు అవకాశం ఉందా అనే కోణంలో అతడి తరఫు న్యాయవాదులు ప్రయత్నాలు చేయగా.. అప్పటికే ఆలస్యం అవుతుండటంతో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు.. భగీరథ్ తండ్రి స్వయంగా అతడిని పోలీసులకు అప్పగించారు. అప్పటికే అతడి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించటంతో భగీరథ్ జైలుకు వెళ్ళక తప్పలేదు. ప్రస్తుతం తెలంగాణలో భగీరథ్ అంశం హాట్ టాపిక్‌గా మారగా.. ఇప్పుడు అతడికి బెయిల్ రాబోతోందన్న వార్త మరింత చర్చనీయాంశంగా మారింది.
