HomeFILM NEWSఫుల్ యాక్షన్ థ్రిల్లర్.. మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి టీజర్ రివ్యూ

ఫుల్ యాక్షన్ థ్రిల్లర్.. మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి టీజర్ రివ్యూ

Published on

Latest articles

పహల్గామ్ దాడి : ఎన్ఐఏ చార్జ్ షీట్‌లో సంచలన నిజాలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం పేరు వినగానే ప్రతి భారతీయుడి గుండె రగిపోతుంది. గత ఏడాది ఏప్రిల్ 22న బైసారన్ లోయలో...

బండి భగీరథ్‌కు బెయిల్..?

పోక్సో కేసులో ప్రస్తుతం జైళ్ళో ఉన్న బండి భగీరథ్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగీరథ్ అరెస్టుకు ముందే...

లోన్ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ షాక్.. లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్

లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ సక్రమంగా చెల్లించలేని సమయంలో ఎక్కడలేని తలనొప్పులు మనకు తెలిసిందే. ఒక్క ఈఎంఐ మిస్...

మిరాయ్ సినిమాలో నెగెటివ్ రోల్‌తో ఆకట్టుకున్న మంచు మనోజ్.. ఇప్పుడు డేవిడ్ రెడ్డి పేరుతో ఓ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రానున్న దసరాకు ఈ సినిమా విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే.. మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా డేవిడ్ రెడ్డి టీజర్‌ను విడుదల చేసింది సినిమా యూనిట్. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. భారత దేశాన్ని బ్రిటిషర్స్ పాలించిన సందర్భంలోని కథ చుట్టూ నడుస్తున్నట్టు కనిపిస్తోంది.

టీజర్‌లో బ్రిటిష్ వారిపై భారతీయుల స్వతంత్ర పోరాటానికి సంబంధించిన సీన్స్ కనిపిస్తున్నాయి. స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన నేతలు.. ముఖ్యంగా గాంధీజీతో కూడిన సన్నివేశాలు టీజర్‌లో ఉన్నాయి. డేవిడ్ రెడ్డి క్యారెక్టర్ ఫుల్ వయెలెన్స్‌తో కూడిన క్యారెక్టర్‌గా కనిపిస్తోంది. టీజర్ డ్యూరేషన్ తక్కువే ఉన్నా.. సినిమా కథను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. చూపించినంత వరకు సీన్స్ బాగానే కనిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ తో పాటు డార్క్ యాక్షన్ థీమ్ కనిపించేలా డైరెక్టర్ టీజర్ కట్ చేయించాడు. పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. చాలా కాలంగా హీరోగా మంచి హిట్ సొంతం చేసుకోలేకపోయిన మంచు మనోజ్.. రీఎంట్రీ భారీ స్థాయిలో ప్లాన్ చేసుకున్నాడు. మరి మంచు మనోజ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

FOLLOW US

More like this