HomeFILM NEWSపోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అనసూయ, విష్ణుప్రియ

పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అనసూయ, విష్ణుప్రియ

Published on

Latest articles

హమ్జా బుర్హాన్ అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు : వీడియో వైరల్

పుల్వామా దాడికి సూత్రధారుల్లో ఒకడైన పాకిస్తాన్ టెర్రరిస్టు కమాండర్ హమ్జా బుర్హాన్‌ను పాకిస్తాన్‌లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి...

ఈ వారం భారీగా తగ్గిన బంగారం ధర

అత్యవసరం అయితే తప్ప బంగారం కొనవద్దంటూ ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన నాటి నుంచి బంగారం...

పెద్ది సినిమాకు షాక్.. టైమ్ చూసి ట్విస్ట్ ఇచ్చిన ఎగ్జిబిటర్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా నడుస్తున్న ఎగ్జిబిటర్ల పర్సెంటేజీ వివాదం.. పెద్ది సినిమా విడుదల సందర్భంగా...

తనను అసభ్యకర రీతిలో చూపిస్తూ ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి తనను ఇబ్బంది పెడుతున్నారంటూ నటి అనసూయ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ట్విటర్ వేదికగా ట్యాగ్ చేస్తూ ‘‘సర్‌.. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించా. కానీ, ఈ ప్రొఫైల్‌లో తరచూ.. నా ఏఐ జనరేటెడ్‌ ఇమేజ్‌లను పోస్టు చేస్తున్నారు’’ అంటూ సజ్జనార్‌కు ట్యాగ్ చేసింది అనసూయ. సోషల్ మీడియాలో ఏఐని ఉపయోగించి సెలబ్రిటీలకు సంబంధించి ఇష్టమొచ్చినట్టుగా ఫోటోలు క్రియేట్ చేస్తున్నారనీ.. వారిపై చర్యలు తీసుకోండి అనేది అనసూయ కంప్లైంట్. ఇక బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ కూడా తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఓ యూట్యూబ్ చానల్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. తనను ఓ అమ్మాయి కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోందనీ.. ఒక అమ్మాయి అయి ఉండి కూడా మరో అమ్మాయినైన తన పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని పేర్కొన్న విష్ణుప్రియ.. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఏఐ ఫ్రీ టూల్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏఐ మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫాలోవర్స్ కోసం యూజర్లు ఇష్టమొచ్చినట్టుగా ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇక యూట్యూబ్ విషయానికి వస్తే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చానల్స్ క్రియేట్ చేసుకోవటం.. తమకు నచ్చని వాటిని టార్గెట్ చేసి ట్రోల్ చేయటం పరిపాటి అయిపోయింది. కొంత మంది స్వయంగా ఫండింగ్ చేసి మరీ యూత్ చేత ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. సోషల్ మీడియా కంటెంట్ పైనా.. ఏఐ టూల్స్ పైనా కంట్రోల్ లేకపోతే అనర్థాలకు దారి తీస్తుందని.. వాటిని నియంత్రించాలని ఇప్పటికే అనేక కంప్లైంట్స్ వస్తుండగా.. ఎక్కువగా సెలబ్రిటీలే ఏఐ ఫేక్ కంటెంట్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

FOLLOW US

More like this