HomeNATIONAL NEWSతమిళనాడు మంత్రులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న విజయ్

తమిళనాడు మంత్రులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న విజయ్

Published on

Latest articles

పహల్గామ్ దాడి : ఎన్ఐఏ చార్జ్ షీట్‌లో సంచలన నిజాలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం పేరు వినగానే ప్రతి భారతీయుడి గుండె రగిపోతుంది. గత ఏడాది ఏప్రిల్ 22న బైసారన్ లోయలో...

బండి భగీరథ్‌కు బెయిల్..?

పోక్సో కేసులో ప్రస్తుతం జైళ్ళో ఉన్న బండి భగీరథ్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగీరథ్ అరెస్టుకు ముందే...

లోన్ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ షాక్.. లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్

లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ సక్రమంగా చెల్లించలేని సమయంలో ఎక్కడలేని తలనొప్పులు మనకు తెలిసిందే. ఒక్క ఈఎంఐ మిస్...

ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకొని తమిళనాడు రాజకీయ చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని తనపేరిట రాసుకున్న దలపతి విజయ్.. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే.. అందులో కొన్ని అందరూ మెచ్చేవి అయితే.. మరి కొన్ని కాస్త విచిత్రంగా అనిపించే నిర్ణయాలు. తాజాగా ఎఐడీఎంకే పార్టీలోని తిరుగుబాటు నేతలందరినీ పిలిచి వారికి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు విజయ్ సిద్ధమయ్యారన్న వార్త తమిళనాడు రాజకీయాలను కొద్ది గంటల పాటు షేక్ చేసింది. కానీ అంతలోనే విజయ్‌కు ఏఐడీఎంకే వార్నింగ్ ఇవ్వటం.. అలాంటిదేమీ లేదని విజయం క్లారిటీ ఇవ్వటంతో పరిస్థితి చల్లబడింది. ఇప్పుడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సుమారు 59 సంవత్సరాలుగా తమిళనాడు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోలేని కాంగ్రెస్ పార్టీకి.. విజయ్ ఏకంగా రెండు మంత్రి పదవులను కట్టబెట్టి ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ మద్దతుతోనే విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తన పార్టీ టీవీకేకు మద్దతిచ్చినందుకు కృతజ్ఞతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలైన రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్‌లకు తమిళనాడు నూతన మంత్రివర్గంలో చోటు కల్పించాడు విజయ్. ఇందుకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చినట్టు విజయ్ పార్టీ పేర్కొంది. ఇన్నేళ్ళుగా తమిళనాడులో సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా.. విజయ్ వల్ల ఇప్పుడు కనీసం తమిళనాడు మంత్రివర్గంలో చోటు సంపాదించటం విశేషం.

FOLLOW US

More like this