HomeINTERNATIONAL NEWSఎబోలా వైరస్ ముంచుకొస్తోంది.. భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ సీరియస్ వార్నింగ్

ఎబోలా వైరస్ ముంచుకొస్తోంది.. భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ సీరియస్ వార్నింగ్

Published on

Latest articles

పహల్గామ్ దాడి : ఎన్ఐఏ చార్జ్ షీట్‌లో సంచలన నిజాలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం పేరు వినగానే ప్రతి భారతీయుడి గుండె రగిపోతుంది. గత ఏడాది ఏప్రిల్ 22న బైసారన్ లోయలో...

బండి భగీరథ్‌కు బెయిల్..?

పోక్సో కేసులో ప్రస్తుతం జైళ్ళో ఉన్న బండి భగీరథ్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగీరథ్ అరెస్టుకు ముందే...

లోన్ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ షాక్.. లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్

లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ సక్రమంగా చెల్లించలేని సమయంలో ఎక్కడలేని తలనొప్పులు మనకు తెలిసిందే. ఒక్క ఈఎంఐ మిస్...

కరోనా వైరస్.. ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని దారుణ పరిస్థితులను నేటి తరానికి పరిచయం చేసిన మహమ్మారి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి కనీసం శ్వాస తీసుకోటానికి కూడా గజగజ వణికేలా చేసిన వైరస్ అది. దేవుడి దయవల్లనో.. మనిషి కృషి వల్లనో ప్రపంచానికి కరోనా ఉపద్రవం తప్పింది. కానీ అంతలోనే మరో మహమ్మారి ప్రపంచాన్ని కబళించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ఆఫ్రికా దేశాల్లో ఎప్పటి నుంచో మనిషి ప్రాణాలను బలిగొంటున్న ఎబోలా మహమ్మారి.. ఈ సారి ఖండాతరాలు దాటి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందంటోంది డబ్ల్యూహెచ్ఓ.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాను ఎబోలా వైరస్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆఫ్రికాలోని కాంగో తూర్పు ప్రాంతంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ అంటువ్యాధి బారిన పడి ఇప్పటి వరకు కనీసం 131 మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో 513 అనుమానిత కేసులున్నాయంటున్నారు. కాంగోలోని ఆస్పత్రులు పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఆ దేశంలోని తూర్పు ఇటూరి, బూనియా, మొంగ్వాలు, ర్వాంపర ప్రాంతాలలో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఎబోలా ఈ వైరస్ క్రమంగా పొరుగున ఉన్న ఉగాండా సహా పలు దేశాల్లో ఎబోలా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే, ఇది అత్యంత అరుదైన వైరస్ రకానికి చెందినది. దీనికి ఎలాంటి టీకా లేదు. కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ఎబొలాను మహమ్మారి గా మాత్రం ప్రకటించలేదు.

కాంబోలో ఎబోలా వేగంగా ప్రమాదకరరీతిలో వ్యాప్తి చెందుతుండటంపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసుస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటీరెండు రోజుల్లోనే తమ విభాగం సమావేశమై, వ్యాధి కట్టడికి అవసరమైన చర్యలపై చర్చిస్తుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులు, ఆరోగ్య సిబ్బంది మరణాలు, ప్రజలు ఒకే చోట ఉండకుండా తరచూ రాకపోకలు సాగించడం వంటివాటిపైనా దృష్టి సారిస్తామన్నారు. కాంగోలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన నేపథ్యంలో సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. ఎబోలా కేసులు పెరుగుతున్న సరిహద్దుల్లోని ఉగాండాకు చెందిన రెండు ప్రావిన్స్‌లకు కూడా ఆరోగ్య సిబ్బందిని పంపిస్తామన్నారు

ఎబోలా వైరస్ గబ్బిలాల నుంచి మనషులకు సోకుతుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు, రక్తాన్ని తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ ప్రాణాంతకమైన వైరస్‌ 21 రోజులపాటు రోగిలో సజీవంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం, అలసట, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, దద్దుర్లు, ఇంకా మూత్రపిండాలు, కాలేయ పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎబోలా వైరస్ సోకిన వారిలో కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ, వాంతులు, విరేచనాలు ఎక్కువవుతాయి. ఇది అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది. మొదటి మరణం సంభవించిన తర్వాత కూడా అధికారులు సాధారణంగా వచ్చే వైరస్‌ వేరియట్‌ అనుమానంతో పరీక్షలు చేయడం, అందులో నెగటివ్‌ అని తేలడంతో ఈ వైరస్‌ కొన్ని వారాల పాటు ఎవరికీ దొరకకుండానే వ్యాప్తి చెందిందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక అంటువ్యాధులలో ఎబోలా ఒకటి. తీవ్రమైన రక్తస్రావ జ్వరానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది ‘ఆర్థోఎబోలావైరస్’ కుటుంబానికి చెందింది. దీని మరణాల రేటు సగటున 50 శాతం వరకు ఉంటుంది. ప్రస్తుత వ్యాప్తి ‘బుండిబుగ్యో’ అనే అరుదైన ఎబోలా స్ట్రెయిన్‌కు సంబంధించినది. దీనికి చికిత్స, వ్యాక్సిన్ పరిమితంగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాంగోలో మొట్టమొదటిసారిగా 1976లో ఈ వైరస్‌ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17సార్లు కాంగోలో ప్రబలింది. 2018–2020 మధ్య కాలంలో దేశంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. కాంగోలోని ఆరుగురు అమెరికన్లకు ఈ వ్యాధి సోకినట్లు పేర్కొన్నారు. వీరిని క్వారంటైన్‌ కోసం సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.

ఎబోలా దేశంలోకి రాకుండా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని నిశితంగా గమనిస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దేశంలోకి ఈ వ్యాధి ప్రవేశించకుండా నిఘా పెట్టామని పేర్కొన్నారు. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఈ పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. దేశంలో ఏదైనా ఎబోలా అనుమానిత కేసు గుర్తిస్తే వెంటనే సంసిద్ధత, స్క్రీనింగ్ యంత్రాగాలు, ప్రతిస్పందన వ్యూహాన్ని అంచనా వేయడానికి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో ఎబోలా వ్యాప్తి లేనప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణాలు, ప్రపంచ అనుసంధానం కారణంగా భారత్ అంటువ్యాధుల ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశానికి ఎబోలా ముప్పు తక్కువగానే ఉందనని అధికారులు చెబుతున్నారుమన దేశంలో గతంతో పోలిస్తే దేశంలో పటిష్ఠమైన విమానాశ్రయ స్క్రీనింగ్ వ్యవస్థలు, నిఘా యంత్రాంగాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచంలో ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలితే అవి దేశంలోకి వచ్చే ప్రమాదం ఉంది.

FOLLOW US

More like this

పహల్గామ్ దాడి : ఎన్ఐఏ చార్జ్ షీట్‌లో సంచలన నిజాలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం పేరు వినగానే ప్రతి భారతీయుడి గుండె రగిపోతుంది. గత ఏడాది ఏప్రిల్ 22న బైసారన్ లోయలో...

బండి భగీరథ్‌కు బెయిల్..?

పోక్సో కేసులో ప్రస్తుతం జైళ్ళో ఉన్న బండి భగీరథ్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగీరథ్ అరెస్టుకు ముందే...

లోన్ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ షాక్.. లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్

లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ సక్రమంగా చెల్లించలేని సమయంలో ఎక్కడలేని తలనొప్పులు మనకు తెలిసిందే. ఒక్క ఈఎంఐ మిస్...