ఒకేసారి 208 యాక్టివా టూ వీలర్లను వికలాంగులకు గిఫ్ట్ గా ఇచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మంగళవారం తన నియోజకవర్గంలోని 208 మంది వికలాంగులకు మూడు చక్రాలతో మాడిఫై చేసిన హోండా యాక్టివాలను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గ ప్రజలకు అప్పుడప్పుడూ చిన్న చిన్న వస్తువులను గిఫ్ట్ గా ఇచ్చే మహిపాల్ రెడ్డి ఈ సారి నిరుపేద వికలాంగుల కోసం ఏకంగా 208 యాక్టివా బైకులను గిఫ్ట్ ఇచ్చి మరోసారి వార్తల్లోకెక్కాడు. ఒక్కొక్క స్కూటర్ ను మాడిఫై చేయించేందుకు మొత్తం కలిపి లక్ష 20 వేల వరకు ఖర్చు అయ్యిందట. అంటే సుమారు రెండున్నర కోట్లు పేద వికలాంగుల కోసం ఖర్చు చేశాడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.