దశాబ్దాలుగా ఇండియన్ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కోకాకోలాతో పాటు మరో విదేశీ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెప్సీకి రిలయన్స్ జియో భారీ షాకిచ్చింది. సుమారు యాభై సంవత్సరాల క్రితం నాటి ఇండియన్ బ్రాండ్ ను జియో మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్లో ఇండియన్ మార్కెట్ ను ఏలేసిన ప్యూర్ దేశీ డ్రింక్ కంపాను కొద్ది నెలల క్రితం ముకేష్ అంబానీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాఫ్ట్ డ్రింక్ ను అదే పేరుతో మళ్ళీ ఇండియన్ మార్కెట్లో రీ లాంచ్ చేశాడు ముకేష్. వచ్చీ రావటంతోనే అన్ని విదేశీ సాఫ్ట్ డ్రింక్స్ కు చెక్ పెట్టే విధంగా మాస్టర్ మార్కెట్ స్ట్రాటజీతో ఎంటరైంది కంపా. కేవలం 49 రూపాయలతో 2 లీటర్ల పెట్ బాటిల్ కస్టమర్లకు అందజేస్తోంది. ప్రస్తుతానికి కంపా కోలా లెమన్ మరియు ఆరెంజ్ ఫ్లేవర్లలో మార్కెట్లోకి వచ్చింది. త్వరలో మరిన్ని ఫ్లేవర్లు రాబోతున్నాయని జియో ప్రకటించింది.
ప్రస్తుతానికి ఫారిన్ బ్రాండ్లకు పూర్తి పోటీ ఇవ్వలేకపోయినా.. మరిన్ని ధరలు, ఫ్లేవర్లతో త్వరలో మార్కెట్లోకి పూర్తి స్థాయిలో ఎంటరై మార్కెట్ ను వశం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది జియో. ఏడేళ్ళ క్రితం ఫ్రీ అన్ లిమిటెడ్ డాటా మరియు కాల్స్ అంటూ టెలీకాం మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో.. ఇప్పుడు ఇండియన్ టెలీకాం మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. కస్టమర్లకు నచ్చే విధంగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి.. క్రమంగా విస్తరించి మొత్తం మార్కెట్ ను శాసించే స్థాయికి రావటం మొదటి నుంచి రిలయన్స్ సంస్థ అనుసరిస్తున్న ప్లాన్. ప్రస్తుతం సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో భారతీయులకు ఎంతో ఇష్టమైన కంపా దేశీ బ్రాండ్ ను లాంచ్ చేసిన జియో.. త్వరలో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్ లో నెంబర్ వన్ అయ్యేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉంది.