Home TELANGANA రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష

రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష

0
రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష

2019లో రాహుల్ గాంధీ పైన నమోదైన పరువు నష్టం కేసులో ఆయనను దోషిగా తీర్పునిస్తూ రెండేళ్ళ జైలు శిక్ష విధించింది మహారాష్ట్రలోని సూరత్ కోర్టు. కానీ ఆ వెంటనే బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి.. అప్పీల్ చేసుకోటానికి అవకాశమిస్తూ నెల రోజుల పాటు శిక్ష నిలుపుదల చేయటం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శిక్ష ఖరారైన సమయంలో రాహుల్ గాంధీ న్యాయమూర్తి ముందే ఉన్నారు. తనకు కాస్త సమయం కావాలంటూ రాహుల్ నేరుగా న్యాయమూర్తిని అభ్యర్థించటంతో న్యాయమూర్తి నెల రోజుల పాటు శిక్ష నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చారు.
2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ప్రచార సభలో మోదీ ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇది వివాదాస్ఫదమైంది. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించకుండా పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్య చేయటంతో మోడీ ఇంటిపేరున్న వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ దీనిపై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ చేసిన కోర్టు ఎట్టకేలకు రాహుల్ గాంధీకి శిక్ష ఖరారు చేసింది. కానీ రాహుల్ మాత్రం తాను అలాంటి వ్యాఖ్య చేయలేదంటూ వాదించాడు. కానీ కోర్టు రాహుల్ వాదనతో ఏకీభవించలేదు. ప్రస్తుతానికి రాహుల్ జైలుకు వెళ్ళకపోయినా.. నెల రోజుల లోపల తన వాదన నిజమని నిరూపించకపోతే మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here