Home TELANGANA హరికృష్ణ క్రూరత్వం : రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

హరికృష్ణ క్రూరత్వం : రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

0
హరికృష్ణ క్రూరత్వం : రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

తన ప్రేమకు అడ్డొస్తున్నాడని ప్లాన్ చేసి మరీ తన స్నేహితుడినే ముక్కలు ముక్కలు నరికి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన స్నేహితుడైన నవీన్ ను హత్య చేసిన తర్వాత హరికృష్ణ పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. కేసులో పోలీసులు అందజేసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన ప్రేమకు అడ్డుగా ఉన్న నవీన్ ను హత్య చేసేందుకు మూడు నెలల కిందటే నిర్ణయించుకున్నాడు. రెండు నెలల క్రితమే ఓ సూపర్ మార్కెట్లో నవీన్ ను నరికి చంపేందుకు కత్తిని కొనుగోలు చేశాడు హరికృష్ణ. ఫిబ్రవరి 17న పెద్ద అంబర్ పేటలో నవీన్, హరికృష్ణ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. హరికృష్ణ కావాలనే ప్లాన్ ప్రకారమే నవీన్ చేత ఎక్కువ మందు తాగించాడట.
మందు తాగిన తర్వాత తన ప్రేమ విషయం తీసిన హరికృష్ణ.. నవీన్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత గొంతు పిసికి చంపేసి.. తల నరికేశాడు. చేతి వేళ్ళు, తన తన బ్యాగులోనే తీసుకెళ్ళి బ్రాహ్మణపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో విసిరేసి పరారయ్యాడు. ఆ తర్వాత తన మరో స్నేహితుడైన హసన్ ఇంటికి వెళ్ళి అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకొని విశాఖపట్నం బయల్దేరాడట. అయితే.. నవీన్ ను హత్య చేసిన విషయం హసన్ కు కూడా చెప్పాడట హరికృష్ణ. వరంగల్, కోదాడ వెళ్ళి అక్కడి నుంచి విశాఖ చేరుకున్నాడు. మళ్ళీ ఫిబ్రవరి 24న హైదరాబాద్ వచ్చి నవీన్ ను హత్య చేసిన చోటుకు వెళ్ళి అక్కడే ఉన్న శరీర భాగాలను కాల్చేశాడు. ఆ తర్వాత తానే హత్య చేసినట్టు అంగీకరిస్తూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇదంతా పోలీసులు రూపొందించిన రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here