ఏదైనా చిన్న విధ్వంసం ఎప్పుడు జరుగుతుందా అని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఎదురు చూస్తుంటారు.. తాము ఎదురు చూస్తున్న టైమ్ రాగానే ప్లాన్ ను అమలు చేస్తారు.. కానీ దాని వెనుక కుట్ర ఉన్నదని తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు.. ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరిగింది ఇదే.
కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ యూరప్ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఓ భారీ వ్యాఖ్య చేశాడు. యూరప్ ఖండం అమెరికాపై ఆధారపడటం తగ్గించుకోవాలనీ.. తమ కాళ్ళపై తాము నిలబడాలనీ ఆ వ్యాఖ్యల సారాంశం. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ తయారు చేసిన ఆయుధాలు, యుద్ధ విమానాలు కొనుగోలు చేయటం ఆపేయాలంటూ బహిరంగంగా యూరప్ దేశాలకు చెప్పాడు మాక్రాన్. సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేయగల సత్తా ఉన్నప్పుడు అమెరికాపై ఆధారపడటం వద్దంటూ తెగేసి చెప్పేశాడు. అయితే.. మాక్రాన్ ఇలా చెప్పటానికి.. ఇప్పుడు ఫ్రాన్స్ లో జరుగుతున్న అల్లర్లకు ఏమిటి సంబంధం.. అంటే.. అసలు కథ అదే మరి. కాకపోతే అసలు కథలోకి వెళ్ళే ముందు ఫ్రాన్స్ లో ఏం జరిగిందో ఓ సారి చూస్తే..
పోలీసులు జాతి వివక్షతో ఓ నల్లజాతీయుడైన యువకుడిని కాల్చి చంపారు.. అందుకే ఫ్రాన్స్ యువత రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తోంది.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది.. ఫ్రాన్స్ అధ్యక్షుడు నల్ల జాతీయుల హక్కులను అణగదొక్కుతున్నాడు.. ఇది బయటి ప్రపంచానికి కనిపిస్తున్న విషయం.
ఫ్రాన్స్ పోలీసుల కాల్పుల్లో మరణించిన యువకుడు అల్జీరియా నుంచి ఫ్రాన్స్ దేశానికి శరణార్థిగా వలస వచ్చిన ఓ ముస్లిం యువకుడు. జైద్ బెన్నా, బౌనా ట్రాఓర్, నహేల్ మెర్జౌక్ అనే 15 నుంచి 17 సంవత్సరాలున్న పిల్లలు ఫుట్ బాల్ ఆడి కారులో తిరిగి వెళ్తున్నారు. వేగంగా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు కారును ఆపి వాళ్ళను హెచ్చరించారు. పోలీసులు అడ్డుగా ఉన్న సమయంలోనే వాళ్ళ హెచ్చరికలను లెక్క చేయకుండా కారును వేగంగా ముందుకు తీసుకెళ్ళగా.. పోలీసులు ఫైరింగ్ చేశారు. దీంతో నహేలీ కారులోనే ప్రాణాలు వదిలాడు. ఇది జరిగిన కొద్ది సేపటికి పోలీసులు నహేలీ కుటుంబాన్ని పిలిచి జరిగింది చెప్పి గంటల్లోనే అంత్యక్రియలు చేసి తంతును పూర్తి చేశారు. జరిగింది ఇదీ.. ఇందులో పోలీసులకు ఆ పిల్లలపై అనుమానం మాత్రమే ఉంది.. జాతి వివక్ష వాళ్ళ మనసులో ఉండొచ్చు.. కానీ కాల్పులు చేయటానికి కారణం మాత్రం వివక్ష కాదు. నిత్యం వందలాది మంది నల్ల జాతీయులను ఫ్రాన్స్ పోలీసులు చూస్తూనే ఉంటారు.. కలుస్తూనే ఉంటారు.. కేసుల్లో విచారిస్తూనే ఉంటారు.. కానీ చాలా అరుదుగా మాత్రమే జాతి వివక్ష బయట పడుతూ ఉంటుంది. అది కూడా పోలీసులను ఎదిరించిన సందర్భాల్లోనే కనిపించింది గత సుమారు 20 సంవత్సరాలుగా. జాతి వివక్ష అనేది ఇరవై సంవత్సరాల క్రితానికి.. ఇప్పటికీ దాదాపు కనుమరుగైపోయింది. ఆఫ్రికా దేశాల నుంచి నల్ల జాతీయులు లక్షల మంది ఈ ఇరవై యేళ్ళలో వారి వారి దేశాలను వదిలి ఫ్రాన్స్ సహా మిగతా యూరప్ దేశాలకు శరణార్థులుగా వలస వచ్చారు. యూరప్ దేశాలు వారికి ఉదారంగా ఆశ్రయం ఇస్తూ వచ్చాయి.. ఎందుకంటే.. ఆయా ఆఫ్రికన్ దేశాల ప్రజలు శరణార్థులుగా మారేంత దారుణమైన పరిస్థితులు ఆయా దేశాలలో సృష్టించేది అమెరికా, యూరప్ దేశాలే కాబట్టి. ఈ దేశాలే అగ్గి రాజేస్తాయి.. వలస వచ్చిన శరణార్థులకు మానవత్వం పేరుతో ఆశ్రయం ఇస్తాయి.. ఇది వేరే కోణం.
అసలు విషయానికి వస్తే.. ఫ్రాన్స్ పోలీసులు జాతి వివక్ష ప్రదర్శించారు అనే దాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే.. జాతి వివక్ష పేరుతో మొత్తం ఫ్రాన్స్ లో ఉన్న నల్ల జాతీయులు రెచ్చగొట్టబడ్డారనేది మాత్రం నిజం. ఎందుకు రెచ్చ గొడతారు.. ఎవరు రెచ్చగొడతారు.. దీని వల్ల ఎవరికి లాభం.. అదే ఇప్పుడు చూద్దాం..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా పెత్తనం ప్రపంచం మీద చాలా వరకు తగ్గిందన్న విషయం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. రష్యా మద్దతు దేశాలపై అమెరికా ఆంక్షలు విధించింది. అలాగే ఉక్రెయిన్ కు సాయం చేసే క్రమంలో అమెరికా తన ఖజనా తానే ఖాళీ చేసుకుంది. ఎన్ని చేసినా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గనేలేదు. ఇవన్నీ అమెరికా పరపతిని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక బైడెన్ తీసుకునే నిర్ణయాలు అమెరికాను 50 యేళ్ళు వెనక్కి వెళ్ళేలా చేసాయి. అమెరికా మాట విని ఉక్రెయిన్ కు సాయం చేసిన ఫ్రాన్స్, జర్మనీ, ఇతర యూరప్ దేశాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ సరఫరా నిలిచిపోవటం వల్ల ఈ దేశాలు అల్లాడిపోయాయి. ఇక అమెరికా మాట వింటే తమను తాము నాశనం చేసుకున్నట్టే అన్న విషయం యూరప్, జర్మన్, ఫ్రాన్స్ దేశాలకు అర్థమైంది. సో.. ఒక్కొక్క దేశం అమెరికాకు దూరమవుతూ వస్తోంది. మనం మొదట్లో చెప్పుకున్నట్టు.. అమెరికాకు వ్యతిరేకంగా యూరప్ దేశాల సమావేశంలో మాక్రాన్ మాట్లాడిన మాటలను అమెరికా తీవ్రంగా పరిగణించింది. అమెరికా ప్రభుత్వాన్ని శాసించే ఆయుధ లాబీ మాఫియాకు మాక్రాన్ మాటలు మంట పుట్టించాయి. ఒక్క ఫ్రాన్స్ మాత్రమే కాదు.. యావత్ యూరప్ దేశాలు సొంతంగా ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్, మిసైల్ సిస్టమ్స్ తయారు చేసుకునే పరిస్థితే వస్తే.. అమెరికా ఆయుధ లాబీ వెపన్స్ కొనేది ఎవరు.. ఈ ప్రశ్న చాలా పెద్దది.
సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవాలన్న వారి ఆలోచన కార్యరూపం దాల్చకూడదంటే ఏం చేయాలో అదే చేస్తోంది అమెరికన్ ఇంటలిజెన్స్ సంస్థ సీఐఏ. ఫ్రాన్స్ లో అగ్గి రగిల్చేందుకు వ్యూహరచన చేసింది.. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసింది.. సరిగ్గా అదే సమయంలో నల్ల జాతీయుడు కాల్చి చంపబడ్డాడు.. సీఐఏకు అవకాశం దొరికేసింది.
గతంలో కూడా నల్ల జాతీయులను ఫ్రాన్స్ పోలీసులు కాల్చి చంపిన సమయాల్లో అల్లర్లు చెలరేగాయి.. తీవ్రంగా కుదిపేశాయి. ఈ సారి కూడా ఓ నల్ల జాతీయుడు కాల్చి చంపబడ్డాడు.. కానీ అల్లర్లు జరిపించింది మాత్రం సీఐఏ. అనువైన సమయం కోసం వేచి చూసిన సీఐఏ.. ఫ్రాన్స్ లో అతి సున్నితమైన అంశమైన నల్లజాతి వివక్షను మళ్ళీ రెచ్చగొట్టింది. నహేలీ అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి.. కానీ అసలు జాతి వివక్ష అనే అంశమే ఎవరికీ కనిపించలేదు సీఐఏ రెచ్చగొట్టే వరకూ. చాలా మంది యువకులకు వాట్సాప్ లో సందేశాలు వచ్చాయి వెంటనే రోడ్లపైకి వెళ్ళి కనిపించిన ప్రతీ దాన్నీ తగలబెట్టమని ఆదేశిస్తూ. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే చాలా మందికి ఇలా రెచ్చగొట్టే వాట్సాప్ మెసేజ్ లు వెళ్ళాయి.. పోలీసుల అదుపులో ఉన్న నిరసనకారుల ఫోన్లలో పోలీసులకు ఇవి కనిపించాయి కూడా. కానీ ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎవరు పంపారో తెలుసుకునే లోపే మెసేజ్ లు మాయం అయిపోయాయి. సైబర్ నిపుణులు ఎంత ప్రయత్నించినా పోలీసులు మాత్రం మెసేజ్ లు ఎవరు ఎక్కడి నుంచి పంపారో చెప్పలేకపోయారు. ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీ అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ గూఢచార సంస్థలైన సీఐఏ, కేజీబీ, మొస్సాద్ వద్ద మాత్రమే ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. అలా సీఐఏ నల్ల జాతి వివక్ష పేరుతో ఫ్రాన్స్ కు వలస వచ్చిన నల్ల జాతీయులను రెచ్చగొట్టింది.. మానవత్వం పేరుతో ఫ్రాన్స్ యువతను కూడా ఇందులోకి లాగి వారి చేత కూడా అల్లర్లు చేయించింది.. మొత్తానికి ఫ్రాన్స్ ఇప్పుడు రావణకాష్టంలా మారింది. సీఐఏ ప్లాన్ సక్సెస్..
అయితే.. ఇలా చేస్తే అమెరికాకు ఏమొస్తుంది.. ఒక్క అమెరికాకే కాదు.. రష్యాకు కూడా ఫ్రాన్స్ తగలబడటం కలిసి వచ్చే అంశం. ఎందుకంటే.. అంతర్యుద్ధం పేరుతో ఫ్రాన్స్ అల్లకల్లోలం చేసి.. అధ్యక్షుడు మాక్రాన్ పదవి నుంచి దిగిపోయేలా చేసి.. మాక్రాన్ ప్రత్యర్థులను తమ వైపు తిప్పుకొని.. వారిని అధ్యక్షుడి కుర్చీలో కూర్చోపెడితే.. ఫ్రాన్స్ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు. ఫ్రాన్స్ ను గుప్పిట్లో పెట్టుకుంటే.. యూరప్ దేశాలు కూడా తమ గుప్పిట్లో ఉన్నట్టే. ఫ్రాన్స్ తో పాటు యూరప్ దేశాలు తన చేయి దాటి వెళ్ళకుండా అమెరికా చేసిన కుట్ర ఇది. ఇప్పుడు పుతిన్ కూడా ఫ్రాన్స్ అంతర్యుద్ధం ముదిరితే తన మాట వినే వ్యక్తిని తీసుకొచ్చి ఫ్రాన్స్ అధ్యక్షుడిని చేయవచ్చనే ఆలోచనలోనే ఉన్నాడు. ఎక్కడా ఏ సాక్ష్యాలు లేకపోయినా.. జరిగింది ఇదే. ఫ్రాన్స్ మీడియా కూడా ఇదే చెప్పింది. అమెరికాకు వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలే ఫ్రాన్స్ ను తగలబెట్టాయనే విషయం అధ్యక్షుడు మాక్రాన్ కు కూడా తెలుసు.. కానీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే నిజాన్ని చెప్పకుండా ఫ్రాన్స్ మీడియాను అడ్డుకున్నాడు మాక్రాన్. అయినా సరే.. విషయం బయటకు పొక్కింది ఎలాగోలా.
ఓ ట్రాఫిక్ పోలీసు తన మాట లెక్కచేయకుండా దూసుకెళ్తున్న కారుపై చేసిన కాల్పులు.. ఆ కాల్పుల్లో పోయిన యువకుడి ప్రాణం.. ఫ్రాన్స్ ను తగలబెట్టేందుకు అమెరికాకు సాయం చేసిందన్నమాట.